‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise Movie). సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు నాని అండ్ టీమ్. ఈ గ్లింప్స్ ఆడియన్స్‌ని ఆశ్చర్య పరిచింది. కాగా ఈ సినిమా కథ సికింద్రబాద్ నేపథ్యంతో సాగుతుందని, 1980లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలకు కొంత కాల్పనికత జోడించి, ‘ది ప్యారడైజ్’ మూవీని శ్రీకాంత్ ఓదెల తీస్తున్నారని తెలిసింది.
కోటి ఖర్చుతో..60 కోట్ల ఓటీటీ డీల్
‘ది ప్యారడైజ్ (The Paradise Movie)’ మూవీ గ్లింప్స్ కోసమే చిత్రంయూనిట్ కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. కానీ గ్లింప్స్ ఆడియన్స్‌లో ఆసక్తిని క్రియేట్ చేసింది. అంతేకాక…ఓటీటీ సంస్థల అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. దీంతో ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ ఇంకా మొదలుకాకుండానే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడు పోయానే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలకే ఓటీటీ (OTT) డీల్స్ కుదరక, ఇంకా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకోలేని ఈ పరిస్థితుల్లో, ఇంకా చిత్రీకరణయే ప్రారంభం కానీ ‘ది ప్యారడైజ్’ మూ వీకి ఈ స్థాయిలో ఓటీటీ డీల్ కుదరడం అంటే విశేషమనే చెప్పుకోవాలి.
నాని ఇంటెన్స్ యాక్షన్ ట్రైనింగ్!
ప్రస్తుతం నాని హిట్3 మూవీ చేస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లోని ఈ మూవీ మే 1న రిలీజ్ కానుంది. ‘హిట్ 3’ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయింది. దీంతో…‘ది ప్యారడైజ్’ మూవీపై ఫోకస్ పెట్టారు నాని. వేసవి తర్వాత ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే ఈ లోపు ఓ ఇంటెన్స్ యాక్షన్ ట్రైనింగ్ తీసుకోనున్నారు నాని. ‘ది ప్యారడైజ్’ మూవీ కోసం కరాటే, మార్షల్ ఆర్ట్స్…వంటి యాక్షన్ స్టంట్స్‌ను నేర్చుకోనున్నారట నాని. ఇందుకోసం నాని స్పెషల్ డైట్‌ను కూడా ఫాలో అవుతారని తెలిసింది. ఇక ‘ది ప్యారడైజ్’ మూవీ చిత్రం 2026, మార్చి 26న రిలీజ్ కానుంది.