Ram Andhraking Thaluka: రామ్‌ ఆంధ్రాకింగ్‌ తాలుకా..!

Viswa
1 Min Read
Andhraking Thaluka

Web Stories

రామ్‌ హీరోగా చేస్తున్న లేటెస్ట్‌ మూవీకి ‘ఆంధ్రా కింగ్‌ తాలుకా’ (Ram Andhraking Thaluka)  టైటిల్‌ ఖరారైంది. మార్చి 15న రామ్‌ బర్త్‌ డే సందర్భంగా ‘ఆంధ్రా కింగ్‌ తాలుకా’ (Andhraking Thaluka) సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రామ్‌ ఓ థియేటర్‌కి వెళ్లడం, ‘ఆంధ్రాకింగ్‌ తాలుకా’ అంటూ ఫ్యాన్స్‌ అంటూ.. యాభై సినిమా టికెట్స్‌ తీసుకోవడం వంటి విజువల్స్‌ ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ వీడియోలో కనిపిస్తాయి.

ఆంధ్రాకింగ్‌ తాలుకా సినిమాలో సినిమా హీరో సూపర్‌స్టార్‌ సూర్యకుమార్‌ పాత్రలో ఉపేంద్ర (Upendra) కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. రాజమండ్రిలో నెల రోజులకుపైగా ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. పి. మహేశ్‌బాబు డైరెక్షన్‌లో మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ ఆంధ్రాకింగ్‌ తాలుకా’ సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీబోర్సే హీరోయిన్‌గా చేస్తున్నారు. మార్చి 15న రామ్‌ బర్త్‌ డే కాబట్టి…‘ఆంధ్రాకింగ్‌ తాలుకా’ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ఈ సినిమా హీరో ఫ్యాన్‌ బాయ్‌ బయోపిక్‌లా ఈ మూవీ ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు.

Please Share
Share This Article
3 Comments
Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu