please subscribe to Tollywoodhub YouTube channel

సామాజిక రుగ్మతలపై దండోరా.. దండోరా రివ్యూ

Kumar NA

Web Stories

తెలుగు సినిమా అంటే కమర్షియల్‌ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌లా ఉంటుంది. అందుకే తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు, సందేశాత్మకచిత్రాలు కాస్త తక్కువగానే వస్తుంటాయి. సామాజిక అంశాలను ప్రశ్నించే, ప్రస్తావించే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలా తెలుగులో వచ్చిన అరుదైన సినిమాయే దండోరా. ఈ సినిమా (Dandora Movie Review) పై మీరూ ఓ లుక్‌ వేయండి.

Dandora movie Review:కథ

తెలంగాణలోని తుళ్ళూరు గ్రామంలో కులవివక్ష తీవ్రంగా ఉంటుంది. అగ్రవర్ణానికి చెందిన వారు చనిపోతే ఊర్లోనే దహనసంస్కారాలు నిర్వహిస్తారు. అదే అణగారిన వర్గానికి చెందిన వారు ఈ ఊర్లో చనిపోతే, ఈ ఊరి బయట వారి అంతిమ సంస్కారాలు చేస్తారు. ఈ గ్రామంలో అగ్ర కులానికి చెందిన వ్యక్తి శివాజీ (శివాజీ). కులం, పరువులే ప్రాణంగా భావిస్తాడు. శివాజీ కుమారుడు విష్ణు (నందు) హైదరాబాద్‌లో ఉంటాడు. అతని కుమార్తె సుజాత (మణిక). అయితే నిమ్న వర్గానికి (తక్కువ కులం) చెందిన రవి (రవికృష్ణ)ను సుజాత ప్రేమిస్తుంది. మరి..ఆ తర్వాత శివాజీ ఏం చేశాడు? తండ్రి శివాజీతో విష్ణు ఎందుకు మాట్లాడటం మానే శాడు? సుజాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? శివాజీ జీవితంలో శ్రీలత (బిందుమాధవి) పాత్ర ఏమిటి? శివాజీ తన తప్పును తాను ఎలా గ్రహించాడు? అనేది సినిమాలో చూడాలి (Dandora  Review)

విశ్లేషణ

అగ్రవర్ణాలు, అణగారిన వర్గాల మధ్య ఉన్న వివక్ష, భేదాభిప్రాయలను చాటిచెబుతూ చాలా సినిమాలే వచ్చాయి. వెబ్‌సిరీస్‌లూ ఉన్నాయి. ఈ కోవలో వచ్చిన కొత్త సినిమాయే ‘దండోరా’. ఈ సినిమా కథనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2004లో జరిగినట్లుగా, దర్శకుడు మురళీకాంత్‌ చూపించాడు. ఈ సినిమాలో కేవలం కులవివక్ష అంశాన్నే హైలైట్‌ చేయకుండ, ప్రేమ, స్వీయ మార్పు..వంటి అంశాలకు తోడుగా స్మసానంలో చోటు అనే ఓ బలమైన పాయింట్‌ను కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. కులవివక్ష, ద్వేషం, ప్రేమ, సామాజిక అసమానతలు..వంటి అంశాలు కథలో సరిగ్గా బ్లెండ్‌ చేయడంలో, దర్శకుడు మురళీకాంత్‌ సక్సెస్‌ అయ్యాడనే చెప్పవచ్చు.

సమానత్వం కోసం తక్కువ జాతి వారు, అగ్రవర్ణాల వారిపై తిరుగుబాటు చేయడం అనే రోటీన్‌ పాయింట్‌కు భిన్నంగా కొత్త పంథాలో ‘దండోరా’ కథను ప్రజెంట్‌ చేశాడు మురళీ కాంత్‌. రవి – సుజాతల ప్రేమకథను వీలైన చోట కరెక్ట్‌గా చూపిస్తూనే, అసరమైనచోట ఎమోషన్స్‌ను స్క్రీన్‌పై చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఎమోషన్స్‌ బాగా వర్కౌట్‌ అయ్యాయి. ఈ సినిమా క్లైమాక్స్‌ ఆకట్టుకుంటుంది. కాస్త సినిమాటిక్‌ లిబర్టీతో తీసిన సన్నివేశాలు, కొన్ని రోటీన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాకపోతే.. దర్శకుడు డీల్‌ చేసిన పాయింట్‌ ఈ సినిమాలోని లోపా లను హైలైట్‌ అయ్యేలా చేయదు. ఇంత సీరియస్‌ డ్రామాలోనూ దర్శకుడు కామెడీని ట్రై చేయ డం అనేది మెచ్చు కోదగ్గ అంశమే. వేశ్య పాత్రలో బిందుమాధవి చెప్పిన కొన్ని డైలాగ్స్‌ కూడా బాగున్నాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

శివాజీ మంచి యాక్టింగ్‌ కనబరిచాడు (Dandora Actor Sivaji). కులంతో ఉగిపోయే అహంకారిగా, తప్పు తెలుసుకుని మదనపడ్డ తండ్రిగా..ఇలా తన నటనలో వేరియేషన్స్‌ చూపించాడు. ఊరు సర్పంచ్‌గా నవదీప్,శివాజీ కొడుకు విష్ణుగా నందుకు మంచి యాక్టింగ్‌ రోల్స్‌ దక్కాయి. మంచి పెర్ఫార్మెన్స్‌ ఇ చ్చారు. రవికృష్ణ, మణికలు కూడ ఉన్నంతలో బాగానే యాక్టింగ్‌ చేశారు. బిందు మాధవి రోల్‌ కూడా ఒకే. దర్శకుడు మురళీకాంత్‌ ఈ సినిమా కథను బాగా చెప్పగలిగాడు. మూడ్నాలుగు అంశాలను కథలో సరైన రితీలో బ్లెండ్‌ చేసి, ఆడియన్స్‌కు కన్వెన్సింగ్‌గా చెప్పగలిగాడు. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం ఈ సినిమాకు ఓ మేజర్‌ పిల్లర్‌. ఆర్‌ఆర్‌ ఈ సినిమాకు ఫ్లస్‌ పాయింట్‌ అనే చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలూ బాగున్నాయి.

Please Share
3,852 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi