అల్లు అర్జున్- అట్లీ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో? అసలు నిజం ఇదే..?

Kumar NA
1 Min Read

Web Stories

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ AA22xA6.. పాన్-వరల్డ్ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ప్రతిరోజూ ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్తలపై ఒక స్పష్టత వచ్చింది.

గత కొద్ది రోజులుగా ఈ మూవీలో బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇది ఒక భారీ మల్టీస్టారర్ కాబోతోందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని తాజా సమాచారం. టైగర్ ష్రాఫ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని సినీ విశ్లేషకులు స్పష్టం చేశారు. అధికారిక ప్రకటన రాకుండానే సోషల్ మీడియాలో జరిగిన ఈ ప్రచారానికి ఇప్పుడు తెరపడింది.దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని గతంలో ఎన్నడూ చూడని విధంగా ‘ప్యార్లల్ యూనివర్స్’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా విజువల్స్ ఉండటం కోసం కేవలం గ్రాఫిక్స్ కోసమే సుమారు రూ. 400 కోట్లు కేటాయించినట్లు సమాచారం.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా మొత్తం కోసం రూ. 700 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్‌లో దీపికా పదుకొనే నటిస్తుండగా, వారితో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఒక బలమైన పాత్రలో కనిపించబోతున్నారు. రమ్యకృష్ణ కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అట్లీ సిద్ధం చేసిన భారీ తారాగణం, విజువల్ వండర్ కాన్సెప్ట్ చూస్తుంటే అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu