please subscribe to Tollywoodhub YouTube channel

సురేందర్ రెడ్డి తో పవన్ లేటెస్ట్ మూవీ.. షూటింగ్ అప్పటినుంచే?

Kumar NA

Web Stories

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘ఓజీ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. దర్శకుడు సుజీత్, అభిమానులు కోరుకున్న మాస్ యాంగిల్‌లో పవన్‌ను ప్రెజెంట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చిలో విడుదలకు సిద్ధమవుతుండటంతో, ఇదే ఆయన చివరి సినిమా కావొచ్చని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే, వాటన్నింటికీ చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని క్రేజీ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు.

‘రాజాసాబ్’ తో నిర్మాతలకు భారీ నష్టం..!

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. మార్చి నెలలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను నిర్మించారు. మొదటి షెడ్యూల్ ఇక్కడే జరగనుంది.

ఈ చిత్రంలో పవన్ సరసన నటించే కథానాయిక ఎవరనే విషయంలో మేకర్స్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఏజెంట్’ వంటి పరాజయం తర్వాత సురేందర్ రెడ్డి చాలా కాలం విరామం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్‌తో సినిమా అనగానే ఆయన స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించారు.

థాయిలాండ్ వెకేషన్.. షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో ప్రణవి మానుకొండ..

ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత రామ్ తాళ్లూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కథా చర్చల్లో పాల్గొని, స్క్రిప్ట్ పర్ఫెక్ట్‌గా కుదిరిందని సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఓజీ ఇచ్చిన ఊపుతో పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సురేందర్ రెడ్డి తన స్టైలిష్ టేకింగ్‌తో పవన్‌ను ఎలా చూపిస్తారో చూడాలి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi