please subscribe to Tollywoodhub YouTube channel

సాయి పల్లవికి గోల్డెన్ ఛాన్స్.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..!

Kumar NA

Web Stories

Sai Pallavi: టాలీవుడ్‌లో ‘ఫిదా’ చిత్రంతో అడుగుపెట్టి, తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటి సాయి పల్లవి (Sai Pallavi). గ్లామర్ కంటే నటనకు, సహజత్వానికి పెద్దపీట వేసే ఈ ‘నేచురల్ స్టార్’, ప్రస్తుతం వరుస విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కెరీర్‌లో మరో భారీ అవకాశం తలుపు తట్టినట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 173వ చిత్రంలో సాయి పల్లవి ఒక కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. విశేషమేమిటంటే, ఈ చిత్రాన్ని లెజెండరీ నటుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్’పై నిర్మిస్తున్నారు.

శిబి చక్రవర్తి ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ నిర్మాణంలో వచ్చిన ‘అమరన్’ చిత్రంలో సాయి పల్లవి అద్భుతమైన నటన కనబరిచింది. ఆ సినిమా సాధించిన విజయం, సాయి పల్లవి పనితీరు పట్ల ఉన్న నమ్మకంతోనే రజిని కాంత్ సినిమాలో ఆమెకు ఈ అవకాశం దక్కిందని టాక్. తెలుగులో ‘తండేల్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూనే, సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన జెండా పాతేందుకు సిద్ధమైంది. నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణ్’ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన సీత పాత్రలో నటిస్తోంది.

బ్రిటిషర్లపై రణబాలి తిరుగుబాటు

తాజాగా బాలీవుడ్‌లో ‘ఏక్ దిన్’ అనే మరో కొత్త ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. కోట్లాది మంది అభిమానులున్నా, సాయి పల్లవి వ్యక్తిగతంగా చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఎక్కడా లగ్జరీల కోసం పాకులాడకుండా, కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ‘స్లో అండ్ స్టడీ’గా తన కెరీర్‌ను నిర్మించుకుంటోంది. ఈ లక్షణమే ఆమెను నిర్మాతలకు ఫేవరెట్ హీరోయిన్‌గా మార్చింది. ఒకవైపు సీతగా, మరోవైపు రజనీకాంత్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ సాయి పల్లవి తన కెరీర్ పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi