అతనితో డేటింగ్ లో ఉన్నా.. తరుణ్ భాస్కర్ తో రిలేషన్ పై ఓపెన్ అయిన హీరోయిన్!

Kumar NA

Web Stories

Eesha Rebba: టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ, దర్శకుడు తరుణ్ భాస్కర్ మధ్య ప్రేమాయణం సాగుతోందని, త్వరలోనే వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని గత కొంతకాలంగా నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలపై ఇప్పటివరకూ మౌనంగా ఉన్న ఈషా, తాజాగా తన రాబోయే చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన “ఓం శాంతి శాంతిః” సినిమా జనవరి 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన ఈషా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. తరుణ్ భాస్కర్‌తో పెళ్లి వార్తలను ఈషా రెబ్బ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి తన తండ్రి కూడా “పెళ్లి ఎప్పుడు?” అని తననే అడుగుతున్నారని ఆమె సరదాగా పేర్కొంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేసింది. ప్రేమ విషయంపై ఈషా చాలా తెలివిగా స్పందించింది.

తరుణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే, తన జీవితంలో ఒకరు ఉన్నారనే విషయాన్ని ఆమె అంగీకరించింది. తాను ప్రస్తుతం ఒకరితో డేటింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనని, అయితే అది ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని ఆమె వెల్లడించింది.

డేటింగ్ చేస్తున్నప్పటికీ, పెళ్లి గురించి ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆ ఆలోచన ఇంకా చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె ఎవరితో డేటింగ్ చేస్తోంది? అది తరుణ్ భాస్కరా లేక వేరే వ్యక్తిలా? అనే విషయంపై ఈషా పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడంతో నెటిజన్లలో ఉత్కంఠ మరింత పెరిగింది. “తాను ఒకరిని ప్రేమిస్తున్నాను” అని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈషా రెబ్బ తన రిలేషన్‌షిప్‌ గురించి స్పష్టత ఇచ్చినప్పటికీ, ఆ ‘మిస్టరీ మ్యాన్’ ఎవరనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచింది. మరి ఈ విషయాన్ని ఆమె ఎప్పుడు రివీల్ చేస్తుందో చూడాలి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi