Nari Nari Naduma Murari OTT release: శర్వానంద్ హీరోగా నటించిన ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫార్మ్ అయ్యింది (Nari Nari Naduma Murari OTT). ఈ ‘నారీ నారీ నడుమ మురారీ’ మూవీ అమె జాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి 4 (Nari Nari Naduma Murari OTT release date) నుంచి స్ట్రీమింగ్ కానుంది (Nari Nari Naduma Murari OTT release). సినిమా విడుదల అయిన మూడు వారాలకే ఈ సినిమా ఓటీపీలో స్ట్రీమింగ్ కి సిద్ధం కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.
మలయాళ హిట్ మూవీ సర్వం మాయ రివ్యూ (ఓటీటీ)..మోడ్రన్ దెయ్యం డెలులు ఏం చేసింది?
2026 సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజైన సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాక్షీ వైద్య, సంయుక్త హీరో హీరోయిన్లుగా నటించారు. వీకే నరేష్, సిరి హనుమంతు, సుదర్మన్, సంపత్‌నంది, వెన్నెల కిషోర్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రామబ్రహ్మాం సుంకర, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు భాను భోగవరపు కథ అందించగా, నందు డైలాగ్స్ ఇచ్చారు.
రెండు డిఫరెంట్ టైమ్‌లైన్ స్టోరీస్‌తో ఈ సినిమా కథనం సాగుతుంది. కాలేజీలో దియా అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడు గౌతమ్ (శర్వానంద్). ఆ తర్వాత ఈ ప్రేమకు బ్రేకప్ చెప్పి, మరో అమ్మాయి నిత్యను ప్రేమిస్తాడు గౌతమ్. నిత్యతో గౌతమ్ పెళ్లి జరగాలంటే… గౌతమ్ కు దియా విడాకులు వచ్చిన సర్టిఫికేట్ కావాలి.మరి..గౌతమ్, దియాలు ఎందుకు విడిపోయారు? నిత్యతో గౌతమ్ పెళ్లి జరిగిందా? లేదా? అనేది ఈ సినిమా కథనం (Nari Nari Naduma Murari Prime)