Prabhas next movies: దాదాపు నాలుగు సంవత్సరాలుగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా జర్నీ సాగింది. స్క్రీన్‌పై ప్రభాస్ కష్టం కనిపించింది కానీ…బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా పడింది. దీంతో ప్రభాస్ నుంచి నెక్ట్స్ థియేటర్స్‌కు రాబోయే సినిమా ఏంటి? అనే డిస్కషన్ మొదలైంది. ఆల్రెడీ ‘ఫౌజి’ సినిమా చిత్రీకరణ ఎప్పట్నుంచో జరుగుతుంది గనక, అందరూ ‘ఫౌజి’నే ప్రభాస్ నెక్ట్స్ రిలీజ్ ఫిల్మ్ అనుకున్నారు.
కానీ సడన్‌గా..‘ఫౌజి’కి ఇంకా చిత్రీకరణ చేయాల్సింది చాలా ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ లోపు ‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 5న (Spirit Movie Release date) రిలీజ్ అని ప్రకటించారు. దీంతో ‘స్పిరిట్’ తర్వాత ‘ఫౌజి’ రిలీజ్ అని కొంతమంది ఊహించారు. కానీ ‘ఫౌజి’ సినిమాను ఈ ఏడాది దసరా (Fauzi Movie Release date) సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు.. తన కాల్షీట్స్ అన్నీ ప్రభాస్ ‘ఫౌజి’ (Prabhas Fauzi)సినిమాకు కేటాయించాల్సిన పరిస్థితి. దీంతో ఈ ప్రభావం ‘స్పిరిట్’ సినిమాపై కూడా పడుతోంది. ‘ఫౌజి’ సినిమా దసరాకు రిలీజ్ కావాలంటే, ప్రభాస్ మేజర్ కాల్షీట్స్ ఈ సినిమాకే కేటాయించాలి. ఇదే జరిగితే ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ స్పీడ్‌కు బ్రేక్ పడ్డట్లే. ఈ ప్రభావం ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ డేట్‌పై పడొచ్చు (Prabhas upcoming films 2026).
ఒకవేళ ‘ఫౌజి’ సినిమా, ‘స్పిరిట్’ (Prabhas Spirit) సినిమాలను ప్రభాస్ సమాంతరంగా కొనసాగించినా, లుక్స్ పరంగా వేరియేషన్స్ కావాలి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే..‘ఫౌజి’ సినిమా లేదా ‘స్పిరి ట్’ సినిమా…వీటిలో ఏదో ఒకటి వాయిదా పడటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. లెట్స్ ..సీ.
ఈ సినిమాల విషయాలు ఇలా ఉంటే…నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లోని ‘కల్కి2’ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారంభించాలనుకుంటున్నారు ప్రభాస్. అలాగే హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో ప్రభాస్ ఆల్రెడీ మూడు సినిమాలు కమిటైయ్యారు. వీటిలో ఒకటి ‘సలార్ 2’. ఓ సినిమాకు ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారట. మరో సినిమా దర్శకుడిపై సరైన స్పష్టత రావాల్సి ఉంది.
Yo, logging in to tmtcashlogin was a breeze. Seriously, no hassles. The interface is pretty good, too. Let’s hope the wins keep coming my way! You can access it at tmtcashlogin.
511betlogin, sounds interesting. Need to find the next winning play. Gonna check it out now! 511betlogin!
555bmwcasino?! Is this casino related to BMW? Haha! Just kidding! But it has my attention. Gonna check out all the games right now. Let’s go to 555bmwcasino.