‘వారణాసి’ మూవీ కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..?

Kumar NA

Web Stories

Varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ అడ్వెంచర్ ‘వారణాసి’. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఫిల్మ్ ఇండస్ట్రీ లో సరికొత్త చర్చ మొదలైంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం మహేశ్ బాబు అందుకోబోయే పారితోషికం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం.

ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, మహేశ్ బాబు ఈ చిత్రం కోసం నేరుగా పారితోషికం తీసుకోకుండా, లాభాల్లో వాటా పద్ధతిని ఎంచుకున్నారట. సినిమా బిజినెస్, లాభాలను బట్టి మహేశ్ బాబుకు దాదాపు రూ. 200 నుండి రూ. 250 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే, టాలీవుడ్ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక హీరో అందుకుంటున్న అత్యధిక పారితోషికంగా ఇది రికార్డు సృష్టిస్తుంది. రాజమౌళి విజన్, మహేశ్ బాబు మేకోవర్ ఈ సినిమాను కేవలం పాన్-ఇండియా చిత్రంగానే కాకుండా, ఒక ‘పాన్-వరల్డ్ ఈవెంట్’ మూవీగా నిలబెడుతున్నాయి. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా విదేశీ నటీనటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న వెండితెరపై సందడి చేయనుంది.

రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, మహేశ్ బాబు క్రేజ్ తోడైన ఈ వారణాసి చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వేచి చూస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos