పొరిగింటి పుల్లకూర పులుపెక్కువ..భారీ రెమ్యూనరేషన్స్‌

Viswa

Web Stories

remunerations: మామూలుగా అయితే టాలీవుడ్‌లోకి బాలీవుడ్‌ హీరోయిన్‌ల రాక ఎక్కువగా ఉంటుంది. వీరి పారితోషికాలు కూడా ఓ లెవల్లోనే ఉంటాయి. కానీ…గత మూడేళ్లుగా టాలీవుడ్‌లో మరో ట్రెండ్‌ కనిపిస్తోంది.

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కన్నా కూడా….తెలుగులో నటించే ఇతరభాషల హీరోలు, క్యారెక్టర్‌ ఆర్టిస్టుల సంఖ్య ఎక్కువ అవుతోంది. టాలీవుడ్‌లోని చాలామంది టాప్‌ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా కూడ చేయకపోవడం, పాన్‌ ఇండియా కలరింగ్‌ కోసం ఇతర నటీనటులను తీసు కుంటుండం…ఇలా ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి (remunerations).

ఇంతవరకు ఒకే. కానీ..పారితోషికాల పరంగా మిగతా భాషల నటీనటుల చేస్తున్న డిమాండ్స్‌ మాములూగా లేవు. ‘కాంతార’ సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టిన రిషబ్‌శెట్టి తెలుగులో సితార బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలో హీరోగా నటిం చేందుకు రిషబ్‌శెట్టి రూ. 80 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.

అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్‌ హీరోగా మరో సినిమా రానుంది. ‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కథ ప్రకారం ఈ సినిమాలో వెంకటేశ్‌–ఫాహద్‌ఫాజిల్‌లు బావ – బామ్మర్థి నటిస్తారట. కానీ ఈ సినిమాలో యాక్ట్‌ చేసేందుకు ఫాహద్‌ దాదాపు రూ. 15 కోట్ల రూపాయాలు డిమాండ్‌ చేస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లోని చాలామంది మిడ్‌రేంజ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోలకు కూడ ఈ రేంజ్‌ రెమ్యూనరేషన్‌ లేదు (Telugucinemanews).

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ చేస్తున్న ‘టాక్సిక్‌’ సినిమా తెలుగు హక్కులను ‘దిల్‌’ రాజు రూ. 120 కోట్ల కు దక్కించుకున్నారు. తెలుగులోని కొంతమంది టాప్‌ హీరోల సినిమాలకు ఈ స్థాయి రేటు లేదు. ఇంకా మైత్రీమూవీస్‌లో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా చేసినందుకు అజిత్‌కు మైత్రీమూవీ మేకర్స్‌ పారితోషకంగా భారీ మొత్తానే చెల్లించారనే వార్తలు ఉన్నాయి(TeluguCinemaLatest news).

ఇవన్నీ చూస్తుంటే తెలుగు దర్శక–నిర్మాతలకు పొరిగింటి పుల్లకూర బాగానే రుచిస్తున్నట్లుగా ఉంది.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos