KoreanKanakaraju Releasing: ‘గాంఢీవదారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’….ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్ సినిమాలతో వరుణ్ తేజ్ కెరీర్ కాస్త డల్‌గా సాగుతోంది. ఇలాంటి సమయంలో వరుణ్‌తేజ్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కొరి యన్ కనకరాజు’ రిలీజ్‌కు సిద్ధమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ కొరియన్ కనకరాజు సినిమా ఆగస్టు 7న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ‘మిరాయ్’ బ్యూటీ రితికా నాయక్ ఈ చిత్రంలో హీరో యిన్‌గా యాక్ట్ చేసింది. హాస్యనటుడు సత్య మరో లీడ్ రోల్ చేశాడు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్ల మూడి ఈ సినిమాకు నిర్మాతలు.
ఈ చిత్రంలో కనకరాజు పాత్రలో నటించాడు వరుణ్‌తేజ్. ఇండో–కొరియన్ హారర్ కామెడీ చిత్రం ఇది. ఈ సినిమా ప్రధానంగా కొరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగినప్పటికీని, కొంత రాయలసీమ నేపథ్యంతో కూడా సాగు తుంది. ఈ చిత్రంలో అనంతపురం వాసిగా వరుణ్‌తేజ్ నటించాడు. అనంత పురంలోని వ్యక్తి కొరియాకు ఎందుకు వెళ్లాడు? అక్కడ ఏం జరిగింది? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా ప్రధాన కథాంశం ఉంటుందని తెలిసింది.
అలాగే వరుణ్‌తేజ్ తర్వాతి సినిమా ‘బరి’. ఈ స్పోర్ట్స్ డ్రామాకు యదువంశీ దర్శకుడు. వరుణ్‌తేజ్ సోదరి నిహారిక కొణిదెల నిర్మించనున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం వాలీవాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వరుణ్‌తేజ్ కాలికి గాయమైంది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. వరుణ్‌తేజ్ పూర్తిగా కోలుకున్న తర్వాతనే, ‘బరి’ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. షూటింగ్ ఆలస్యమైంది కనుక, బరి సినిమా సంక్రాంతి పండక్కి రిలీజ్ అయ్యే అవకాశమే లేదు.