Sitaare Zaneen Par Release: కుబేరకు పోటీగా ఆమిర్‌ఖాన్‌

Viswa
2 Min Read
Ameerkhan Sitaare Zaneen Par movie Release

Web Stories

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan Sitaare Zaneen Par Release) హీరోగా సినిమా థియేటర్స్‌లోకి వచ్చి, దాదాపు మూడు సంవత్సరాలవుతోంది. ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ అమెరికన్‌ ఫిల్మ్‌ ‘ది ఫారెస్ట్‌ గంప్‌’ సినిమాను హిందీలో ‘లాల్‌సింగ్‌ చద్దా’గా రీమేక్‌ చేసి, దారుణంగా దెబ్బతిన్నారు ఆమిర్‌ఖాన్‌. ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమాకి ముందు ఆమితాబ్‌బచ్చన్‌తో కలిసి ఆమిర్‌ఖాన్‌ తొలిసారి చేసిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ మూవీ కూడా డిజాస్టర్‌గా మిగిలింది. ఆమీర్‌ఖాన్‌ ఎన్నో ఆశలు పెట్టుకుని, ఎంతో కష్టపడి తీసిన ‘లాల్‌సింగ్‌చద్దా’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ కావడం ఆమిర్‌ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత సిని మాల నుంచి కొంత గ్యాప్‌ తీసుకున్నాడు ఆమిర్‌ఖాన్‌.

స్పానిస్‌ మూవీ ఆధారంగా…

ఏడాదిడన్నర గ్యాప్‌ తర్వాత సైలెంట్‌గా ‘సితారే జమీన్‌ పర్‌’ అనే మూవీని స్టార్ట్‌ చేశాడు. ఆమిర్‌ కెరీర్‌లోని ‘తారే జమీన్‌ పర్‌’ (Aamir Khan Sitaare Zaneen Par)మూవీ బ్లాక్‌బస్టర్‌. సో…ఈ సినిమాకు ‘సితారే జమీన్‌ పర్‌’ సీక్వెల్‌ అని మూవీ లవర్స్‌ అనుకున్నారు. కానీ …‘సితారే జమీన్‌ పర్‌’ మూవీ ‘ఛాంపి యన్స్‌’ అనే ఓ స్పానిస్‌ ఫిల్మ్‌ ఆధారంగా తీయబడింది. ఆమిర్‌ఖాన్, జెనీలియా హీరో హీరోయిన్స్‌గా చేసిన ఈ మూవీకి, ఆర్‌ఎస్‌ ప్రసన్న డైరెక్టర్‌. చిత్రీకరణ ఎప్పుడో ముగిసింది. లేటెస్ట్‌గా…‘సితార జమీన్‌ పర్‌’ సినిమాను జూన్‌ 20న (Aamir Khan Sitaare Zaneen Par Release Date) రిలీజ్‌ చేస్తున్నట్లుగా ఆమిర్‌ఖాన్‌ అధికారికంగా ప్రకటించారు. రెండు వరుస ఫ్లాప్‌ మూవీస్‌ తర్వాత ఆమిర్‌ఖాన్‌ నుంచి రాబోతున్న ఈ ‘సితారే జమీన్‌ పర్‌’మూవీపై బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.

ధనుష్‌–నాగార్జున సినిమాలకు పోటీగా….!

ధనుష్‌–నాగార్జునలు హీరోగా చేసిన లేటెస్ట్‌ మూవీ ‘కుబేర (Kubera)’. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లోని ఈ మూవీ కూడా జూన్‌ 20న రిలీజ్‌ కానుంది. హిందీలోనూ ‘కుబేర’ చిత్రం రిలీజ్‌ అవుతుంది.దక్షిణాదిలో ఆమిర్‌ఖాన్‌ ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమాకు పెద్ద బజ్‌ ఉండదుకాబట్టి..హిందీ బాక్సాఫీస్‌ వద్దే ఆమిర్‌ సినిమాతో ధనుష్‌–నాగార్జునల ‘కుబేర’ చిత్రం పోటీ పోడాల్సి ఉంటుంది. ‘కుబేర’ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi