పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఆ హీరోతో.. సమంత ఓకే చెబుతుందా?

Kumar NA

Web Stories

కోలీవుడ్ విలక్షణ నటుడు శింబు (STR), టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘అరసన్’. ఇటీవలి కాలంలో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శింబుకు, కమల్ హాసన్‌తో కలిసి నటించిన ‘థగ్ లైఫ్’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, వెట్రిమారన్ మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి. క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది.

‘రాజాసాబ్’ తో నిర్మాతలకు భారీ నష్టం..!

మదురైకి చెందిన ఒక సామాన్య కబడ్డీ క్రీడాకారుడు, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల చెన్నైకి చేరుకోవడం.. అక్కడ పరిస్థితులు అతడిని ఒక పవర్‌ఫుల్ ‘డాన్’గా ఎలా మార్చాయి అనేదే ‘అరసన్’ ప్రధాన ఇతివృత్తం. ఈ సినిమాలో శింబు ఒక యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు.

ఉత్తర చెన్నై నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ టాలీవుడ్ అండ్ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తే, శింబు సరసన ఆమె నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. విజయ్, సూర్య వంటి స్టార్ల సరసన నటించిన సమంత, చాలా కాలం తర్వాత తమిళంలోకి తిరిగి వస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగాయి.

అందుకే రజనీకాంత్‌ సినిమా నుంచి తప్పుకున్నాను: లోకేష్‌ కనగరాజ్‌

ప్రస్తుతం నిర్మాతలు ఆమెతో చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా మార్చేందుకు వెట్రిమారన్ మరో మాస్టర్ ప్లాన్ వేశారు. ఇందులో ఒక పవర్‌ఫుల్ స్పెషల్ రోల్ కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. దీంతో ‘అరసన్’ ఒక భారీ మల్టీస్టారర్ చిత్రంగా రూపాంతరం చెందింది.

శింబు – వెట్రిమారన్ కాంబోలో వస్తున్న మొదటి చిత్రం కావడం, దానికి తోడు విజయ్ సేతుపతి, సమంత వంటి స్టార్లు తోడవుతుండటంతో ‘అరసన్’ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi