‘ఏజెంట్’ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత అఖిల్ (Akkineni akhil) సినిమా నెక్ట్స్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదరుచూస్తూనే ఉన్నారు. ఎట్ట కేలకు అఖిల్ ఫ్యాన్స్ నీరిక్షణకు తెరపడంది. అక్కినేని అఖిల్ నెక్ట్స్ మూవీని గురించిన అధికారిక ప్రకటన ఏప్రిల్ 8న రానుంది. అంటే..ఈ రోజు అఖిల్ బర్త్ డే సందర్భంగా రానుంది.
సితార ఎంటర్‌టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘లెనిన్’ (Lenin) అనే టైటిల్ పరిశీలి స్తున్నారు. కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా తీసిన అబ్బూరి మురళీ ఈ సినిమాకు దర్శకుడు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో మొదలైపోయింది. శ్రీలీల హీరోయిన్. రాయలసీమ నేపథ్యంతో సాగే యాక్షన్ లవ్‌స్టోరీ ఫిల్మ్. కానీ ఎందుకో ఇప్పుడు అనౌన్స్‌చేస్తున్నారు. ఏప్రిల్ 8న రాబోయే ‘లెనిన్’ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో, రిలీజ్ డేట్ కూడా ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇంకా సలార్, కేజీఎఫ్ వంటి సినిమాలను తీసిన దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాంపౌండ్‌లోని యువ దర్శకుడు అనిల్‌తో కూడా అఖిల్ ఓ మూవీ చేయాలి. ఇది భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్. సో…ఈ మూవీకి ఇంకా సమయం ఉంది. భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘లెనిన్’ విజయంపై ఈ మూవీ ఆధారపడి ఉంది.
కాగా..రేపు అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా కాబోయే ప్రేయసితో కలిసి అఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఆల్రెడీ ఫారిన్ కంట్రీలో ల్యాండ్ అయ్యారు.
This post is extremely radiant. I really like this post. It is outstanding amongst other posts that I’ve read in quite a while. Much obliged for this better than average post. I truly value it!