Allari Naresh 12A Colony: ప్రాణాలతో పోవుడు అవసరం లేదన్నా..

Allari Naresh 12A Colony: అల్లరి నరేశ్‌ కొత్త సినిమాకు 12ఏ రైల్వేకాలనీ అనే టైటిల్‌ ఖరారైంది. 'పొలిమేర, పొలిమేర 2..' సినిమాల దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌ కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు.

Viswa
1 Min Read
Allari Naresh 12A Colony

హాస్యభరితమైన సినిమాలు కాకుండ…రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్నారు. ఈ కోవలో అల్లరి నరేశ్‌ చేసిన ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి సినిమాలు ఫర్వాలేదనిపించాయి. ఇప్పుడు మరోసారి మరో ప్రయోగాత్మక సినిమాతో అల్లరి నరేశ్‌ రెడీ అవుతున్నారు. ‘పొలిమేర, పొలిమేర 2’ వంటి సినిమాలో బ్లాక్‌బస్టర్స్‌ కొట్టిన అనిల్‌ విశ్వనాథన్‌ ఓ కథను రెడీ చేసి, ఈ కథతో ‘12ఏ రైల్వేకాలనీ’ (Allari Naresh 12A Colony) మూవీ తీస్తున్నాడు. ఈ హారర మూవీలోనే అల్లరి నరేశ్‌ హీరోగా చేస్తున్నారు. ఈ సోమవారం ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. హారర్‌ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందు తున్న చిత్రంగా తెలుస్తోంది.

రిలీజ్‌కు రెడీ!

అలరి నరేశ్‌ ప్రధాన పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ‘పొలిమేర, పొలిమేర2’ చిత్రాల్లో యాక్ట్‌ చేసిన కామాక్షీ భాస్క ర్ల ఈ మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తున్నారు. సాయికుమార్, వైవా హర్ష, గెటప్‌ శీను, జీవన్‌కుమార్‌లు ఇతర లీడ్‌ రోల్స్‌లో యాక్ట్‌ చేస్తున్నారు. నాని కాసరగడ్డ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండటంతో పా టుగా, ఎడిటింగ్‌ బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. మేలో రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కమ్‌బ్యాక్‌ ఇవ్వాల్సిన టైమ్‌

‘అల్లరి’ నరేశ్‌ హీరోగా చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు, బచ్చలమల్లి..’వంటి సినిమాలు బాక్సాపీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంతో మళ్లీ ఓ హిట్‌తో కమ్‌బ్యాక్‌ ఇవ్వాల్సిన ఒత్తిడి అల్లరి నరేశ్‌పై ఉంది. మరి..ఈ ‘12ఏ రైల్వేకాలనీ’ మూవీ హిట్‌ గా నిలుస్తుందా? అనేది చూడాలి. పైగా హారర్‌ జానర్‌తో తొలిసారి అల్లరి నరేశ్‌ చేస్తున్న ఫిల్మ్‌ ఇది. దీంతో ఈ మూవీలో నరేశ్‌ యాక్టింగ్‌ ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి అయితే ఆడియన్స్‌లో క్రియేట్‌ అయ్యింది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *