Balakrishna: నందమూరి అభిమానుల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘దేవర 2’ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్‌కు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త కాస్త ఆందోళన కలిగిస్తోంది. అదేంటంటే.. దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కంటే ముందే నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ నిర్మాత నాగవంశీ, బాలయ్య-కొరటాల కలయికలో ఒక భారీ మాస్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘డాకు మహారాజ్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఈసారి ఎలాగైనా బాలయ్యతో సెన్సేషనల్ హిట్ కొట్టాలని నాగవంశీ పట్టుదలతో ఉన్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘దేవర 2’ పట్టాలెక్కడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. తారక్ ప్రస్తుతం తన ఇతర ప్రాజెక్టుల (డ్రాగన్, ప్రశాంత్ నీల్ సినిమా)తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ అందుబాటులోకి వచ్చే లోపే బాలయ్యతో ఒక సినిమా పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నారట. దీనివల్ల ‘దేవర 2’ షూటింగ్ మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది పక్కా మాస్ అండ్ కమర్షియల్ సబ్జెక్ట్ అని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఉగాది పర్వదినం సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. ఒకవైపు బాలయ్య-కొరటాల కాంబో వినడానికి ఎగ్జైటింగ్‌గా ఉన్నా, తారక్ అభిమానులు మాత్రం ‘దేవర 2’ ఎప్పుడు మొదలవుతుందా అని కంగారు పడుతున్నారు. మరి కొరటాల శివ తన ప్రాధాన్యతను ఏ ప్రాజెక్ట్‌కు ఇస్తారో, ‘దేవర 2’ అప్‌డేట్‌పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.