Daaku Maharaaj Ott: ఓటీటీలో డాకుమహారాజ్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..!

Viswa
1 Min Read

Web Stories

బాలకృష్ణ కెరీర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ హిట్స్‌లో ఒకటైన ‘డాకు మహారాజ్‌’ మూవీ ఓటీటీలో (Daaku Maharaaj Ott) స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. 2025, ఫిబ్రవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ‘డాకుమహారాజ్‌’ మూవీ స్ట్రీమింగ్‌ రానుంది.

DaakuMaharaaj Review: డాకుమహారాజ్‌ రివ్యూ

బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్‌లో రూపొందిన ‘డాకు మహారాజ్‌’ మూవీ ఈ ఏడాది సంక్రాంతి సంద ర్భంగా జనవరి 12న థియేటర్స్‌లోకి వచ్చింది. దాదాపు రూ. 140 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిందీ చిత్రం. ‘డాకుమహారాజ్‌’ సినిమా కలెక్షన్‌ షేర్‌ రూ. 100 కోట్లకు చేరుతుందని మేకర్స్‌ ఊహించినా, అదీ సాధ్యపడలేదు. డాకుమహారాజ్‌ మూవీకి అపోజిట్‌లో వెంకటేష్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఉండటంతో, ‘డాకుమహారాజ్‌’ చిత్రానికి రూ. 100 కోట్ల షేర్‌ కలెక్షన్‌ సాధించ లేకపోయింది. కానీ ఈ చిత్రం మాత్రం సెమీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి’ చిత్రాల తర్వాత బాలకృష్ణ కెరీర్‌లో వరుసగా ‘డాకు మహారాజ్‌’ మూవీ రూపంలో మరో సూపర్‌హిట్‌ మూవీ దక్కింది.

ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ చేస్తున్నారు బాలకృష్ణ. ఈ నెక్ట్స్‌ తనతో ‘వీరసింహారెడ్డి’ తీసిన గోపీచంద్‌ మలినేనితో మరో మూవీ చేస్తారు బాలకృష్ణ. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత అనిల్‌ రావిపూడితో బాలకృష్ణ మరో మూవీ చేసే చాన్సెస్‌ ఉన్నాయన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వరుస హిట్స్‌తో బాలకృష్ణ తన పారితోషికాన్ని కూడా పెంచేశారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi