Koratalasiva next film: దర్శకుడు కొరటాల శివతో బాలయ్య?

Viswa
1 Min Read

Web Stories

Koratalasiva next film: ఎన్టీఆర్‌తో ‘దేవర’ సినిమా చేసిన తర్వాత, దర్శకుడు కొరటాల శివ దేవర2 (Devara2 Movie)  స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్‌లైనప్‌ మాత్రం సుధీర్ఘంగా ఉంది. దీంతో ‘దేవర 2’ (Devara 2) సినిమాను పట్టాలెక్కించే ముందే, మరో సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్ల నున్నారు దర్శకుడు కొరటాల శివ.

రీసెంట్‌ టైమ్స్‌లో వివేక్‌ ఆత్రేయ, విజయ్‌ కనకమేడల…ఇలా చాలామంది దర్శకులు చెప్పిన కథలను విన్నారట బాలకృష్ణ. కానీ ఇటీవల దర్శకుడు కొరటాల శివ చెప్పిన కథను బాలకృష్ణ ఫైనలైజ్‌ చేశారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, చెరుకూరి సుధాకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారట.

ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేయనున్నారు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే, కొరటాల శివ సినిమానూ సెట్స్‌కు తీసుకువెళ్లాలన్నది బాలకృష్ణ ప్లాన్‌ అట. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి బాలకృష్ణ సినిమా ఒకటి థియేటర్స్‌లోకి రావడం ఖాయం అంటున్నారు మేకర్స్‌. మరి…గోపీచంద్‌ మలినేనితో బాలకృష్ణ చేసే సినిమా సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందా? లేక కొరటాల శివ డైరెక్ట్‌ చేయబోయే సినిమా రిలీజ్‌ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Please Share
Share This Article
144 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu