హారర్‌ మూవీ ఈషా రివ్యూ

Viswa

Web Stories

Eesha Movie review in Telugu: హారర్‌ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాల్లోని కథ, కథనాలు కొత్తగా ఉంటే, ఆడియన్స్‌ ఈ తరహా సినిమాలను ఆదరిస్తారు. ఈ జానర్‌లో కొత్తగా వచ్చిన ‘ఈషా’ సినిమా మరి..ఆడియన్స్‌ను మెప్పించిందా? ఈ సినిమా రివ్యూలో చదివేయండి.

కథ

కల్యాణ్‌ (త్రిగుణ్‌), వినయ్‌ (అఖిల్‌రాజ్‌), నయన (హెబ్బాపటేల్‌), అపర్ణ (సిరి హనుమంతు) మంచి మిత్రులు. దెయ్యాలు, ఆత్మలు గట్రా ఏమీ ఉండవని బలంగా నమ్ముతుంటారు. మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని, సామన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కొంతమండి నకలీ బాబాలు, దొంగ స్వామిజీల ఆటకట్టిస్తుంటారు. అలా ఆంధ్ర–ఒడిస్సా బోర్డర్‌లో ఉన్న ఆది దేవ్‌ (పృథ్వీరాజ్‌) గురించి వీరికి తెలుస్తుంది. వృత్తి రిత్యా డాక్టర్‌ అయిన ఆది దేవ్‌ తన ప్రవృత్తిని మార్చుకుని, బాబాగా ఓ ఆశ్రమం నడుపుతుండటం వీరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో ఆది దేవ్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టాలని, అక్కడికి బయలుదేరుతారు. ఆది దేవ్‌ని కలుస్తారు. ఆత్మలు, దేయ్యాలు లేవని ఈ నలుగురు ఆదిదేవ్‌తో మాట్లాడతారు. దీంతో ఓ పాడుబడ్డ భవంతిలో మూడురోజులు ఉంటే, ఆత్మలు ఉన్నాయన్నట్లుగా తెలుస్తుందని, ఈ సవాల్‌ను స్వీకరించమని ఈ నలుగురు స్నేహితులను అడుగుతాడు ఆది దేవ్‌. వీరు సరేనని ఈ భవంతిలోకి వెళతారు. మరి..ఆ తర్వాత ఏం జరిగింది. ఈ నలుగురు మిత్రులను పుణ్యవతి ఆత్మ ఎందుకు చంపాలనుకుంటుంది? న్యూరాలజిస్ట్‌ ఆదిదేవ్‌ ఎందుకు బాబాగా మారాడు? అన్నది ‘ఈషా’ సినిమాలో చూడాలి (Eesha Movie review in Telugu)

విశ్లేషణ

‘సడన్‌గా చనిపోయిన వారు తాము ఈ లోకంలో ఇక లేము అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక, ఆత్మలుగా మారతారి ఘోషిస్తుంటారు. పగ తీర్చుకోవాలని ఉద్రేకపడుతుంటారు’ అనే పాయింట్‌ని ఈ ‘ఈషా’ చిత్రంతో దర్శకుడు శ్రీని వాస్‌ డీల్‌ చేసినట్లుగా తెలుస్తుంది. ఇందుకు దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే ఓ ఓల్డ్‌ ప్రశ్న, ఓ హాంటెడ్‌ హౌస్, భూత వైద్యం..లను కథా వస్తువులుగా చేసుకున్నాడు. కానీ దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని కన్వే చేయడంలో పూర్తిగా సఫలం కాలేదనే చెప్పవచ్చు. దెయ్యాలు, భూతాలు లేవని నమ్మేవారికి, ఓ బాబా నుంచి సవాల్‌ ఎదురుకావడం అనేది కూడ పాత పాయింట్‌.

Eesha Movie review in Telugu

పాడుపడ్డ భవంతి నేపథ్యం, అక్కడ జరుగుతున్న వరుస చావులకు సంబంధించిన అంశాలు కాస్త విజువల్‌గా ఉంటే బాగుండేది. జస్ట్‌ వాయిస్‌ ఓవర్‌తో చుట్టేస్తే, ఆడియన్‌ ఎంగేజ్‌ కావడం, కథకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ కావడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పైగా కథకు ఎంతో కీలకమైన ఆది దేవ్‌ ఎందుకు బాబాగా మారాడు? అన్న విషయం కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్‌ కాలేదు. అయితే సినిమాలో ఉన్న కొన్ని హారర్, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఒకే అనిపిస్తాయి. ఇంట్రవెల్‌ బ్యాంగ్‌ ఒకే. క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ కొంతమేరకు బాగానే ఉంది. పార్టు 2కు లీడ్‌ ఇచ్చారు.

నటీనటులు

త్రిగుణ్, అఖిల్‌రాజ్, హెబ్బాపటేల్, సిరి హనుమంతు..వారి వారి పాత్రల్లో బాగా యాక్ట్‌ చేశారు. హెబ్బా పాత్రకు చివర్లో ఎమోషనల్‌ టచ్‌ ఉంది. గర్భవతిగా సిరి హనుమంతు
యాక్ట్‌ చేసి, కొన్ని సీన్స్‌లో మెప్పించింది. త్రిగుణ్‌ సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. అఖిల్‌ రాజ్‌ యాక్టింగ్‌ ఒకే. ఇక ఆది దేవ్‌గా పృథ్వీరాజ్‌ యాక్టింగ్‌ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఓ గిరిజన యువకుడిగా కనిపించే మైమ్‌ గోపీ యాక్టింగ్‌ ఈ సినిమాకు ఓ మేజర్‌ హైలైట్‌. యాక్టింగ్‌కు మంచి స్కోప్‌ ఉన్న రోల్‌ దక్కింది. విజువల్స్‌ బాగు న్నాయి. ధ్రువన్‌ సంగీతం ఆడి యన్స్‌ను భయపెడుతుంది. ఆర్‌ఆర్‌ బాగుంది. ఈ సినిమాకు ఆర్‌ఆర్‌ మరో ప్లస్‌ పాయింట్‌. నిర్మాణ విలువలు ఈ సినిమా కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi