టాలీవుడ్‌ ఎంట్రీ..ప్చ్‌..కలిసి రాలే!

Viswa
Bollywood Actor Emranhaashmi tollywood entry

Web Stories

బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హాష్మి (EmraanHashmi) కి తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దగా కలిసొచ్చినట్లుగా లేదు. ఇమ్రాన్‌ హష్మి ప్రజెంట్‌ అడివి శేష్‌ ‘గూఢచారి 2’, పవన్‌కల్యాన్‌ ‘ఓజీ’ సినిమాలు చేస్తున్నాడు. అయితే ‘గూఢచారి 2 (Gudachari2 G2)’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఇమ్రాన్‌ హైదరాబాద్‌ వచ్చి, ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో భాగంగా తీవ్రగా గాయపడ్డాడు. దీంతో హాస్పిటల్‌కు వెళ్లి, ఆ తర్వాత ట్రీట్‌మెంట్‌ తీసుకుని, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ముంబైలో తిరిగి ‘గూఢచారి 2’ సిని మా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఇది గత ఏడాది అక్టోబరులో జరిగింది.

ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ (Pawankalyan) ‘ఓజీ’ (OG Movie)సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాడు ఇమ్రాన్‌హష్మి (Emranhaashmi Health). కానీ అనూహ్యంగా ఇమ్రాన్‌ అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇమ్రాన్‌కు డెంగ్యూ సోకిందనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ఓజీ సినిమా షూటింగ్‌కు తాత్కలికంగా బ్రేక్‌ పడింది. మరో విశేషం ఏంటంటే…ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌–ఇమ్రాన్‌ల మధ్య సన్నివేశాలను తీస్తున్నారట. ఈ తరుణంలో ఇమ్రాన్‌కు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబరు 27న విడుదల కావాల్సిన ఓజీ సినిమా రిలీజ్‌పై ఇది ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఏదీ ఏమైనా..ఇమ్రాన్‌హష్మికి టాలీవుడ్‌ ఎంట్రీ కాస్త ఇబ్బందికరంగానే మారినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్‌లో మర్డర్‌, మర్డర్‌2, రష్‌, టైగర్‌ 3 …వంటి సినిమాలతో ఇమ్రాన్‌ హష్మి మంచి నటుడిగానే పేరు తెచ్చుకున్నారు. మొదట్లో హీరోగా చేసిన ఈ నటుడు, మెల్లిగా విలన్‌ క్యారెక్టర్స్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi