please subscribe to Tollywoodhub YouTube channel

RashmikaMandanna Movies: మహారాణి ఏసుబాయి…ఈ ఏడాది ఐదు సినిమాల రిలీజ్‌లు

హిందీ చిత్రాలు సికందర్‌, ఛావా, థామాలతో పాటుగా, 'ది గర్ల్‌ఫ్రెండ్‌', 'కుబేర'...ఇలా రష్మికా మందన్నా నటించిన ఐదు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్‌ కానున్నాయి.

Viswa
2 Min Read
Rashmika Mandanna Chhaava

Web Stories

బాలీవుడ్‌లో రష్మికా మందన్నా (RashmikaMandanna Movies) యాక్ట్‌ చేస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘ఛావా’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌ హీరో. లక్ష్మణ్‌ ఉటేకర్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. దినేష్‌ విజన్‌ నిర్మించిన ఈ హిస్టారికల్‌ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ నుంచి విక్కీ కౌశల్, రష్మికా మందన్నాల ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ను రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. తాజాగా రిలీజ్‌ చేసిన రష్మికా మందన్నా (RashmikaMandanna Movies) ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటుంది.

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ తనయుడు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా ‘ఛావా’ (Chhaava) అనే మూవీ తీస్తున్నారు. ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ కౌశల్‌ యాక్ట్‌ చేశారు. అతని భార్య ఏసుబాయిగా రష్మికా మందన్నా యాక్ట్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. రేపు ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్నారు.

వాయిదా పడ్డ ఛావా!

‘ఛావా’ మూవీ డిసెంబరు 6, 2024న రిలీజ్‌ కావాల్సింది. కానీ అదే సమయానికి ‘పుష్ప ది రూల్‌’ మూవీ కూడా రిలీజ్‌ రెడీ కావడంతో ‘ఛావా’ మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేస్తున్నారు.

Venkatesh: ఆల్‌టైమ్‌ సంక్రాంతి రికార్డు సాధ్యమేనా?

ఇటీవల గాయపడ్డ రష్మికా మందన్నా

‘ఛావా’నే కాకుండా హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ‘సికందర్‌’, ఆయుష్మాన్‌ఖురానాతో ‘థామా’ అనే మూవీస్‌ చేస్తున్నారు రష్మిక. అయితే ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో రష్మికా మందన్నా గాయపడ్డారు. దీంతో ‘సికందర్‌’, ‘థామా’ సినిమాల షూటింగ్‌లకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. అతి త్వరలోనే రష్మికా మందన్నా తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారు.

RashmikaMandanna Injured: గాయపడ్డ రష్మిక…సల్మాన్‌ఖాన్‌కు షాక్‌

బాలీవుడ్‌లో ఈ ఏడాది మూడు సినిమాలు

సల్మాన్‌ఖాన్‌ ‘సికందర్‌’ ఈ ఏడాది రంజాన్‌కు, ‘థామా’ చిత్రం దీపావళికి రిలీజ్‌ కానున్నాయి. ఛావా చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్‌ అవుతోంది. ఇలా ఈ ఏడాది మూడు బాలీవుడ్‌ చిత్రాలు రష్మికా నుంచి విడుదల అవుతాయి.

మొత్తంగా ఐదు

‘సికందర్‌’, ‘థామా’, ‘చావా’ చిత్రాలతో పాటుగా రష్మికా మందన్నా చేస్తున్న ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. అలాగే రష్మిక హీరోయిన్‌గా చేసిన ‘కుబేర’ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్‌ అవుతుంది. ఇలా…ఇప్పటివరకు రష్మికా మందన్నా… నటించిన ఐదు సినిమాలు…ఈ ఏడాది రిలీజ్‌కు రెడీ అయ్యాయి.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi