
దుల్కర్సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు సాత్విక వీరవల్లి.

ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశారు.

సాత్విక యూఎస్లోనే పుట్టి పెరిగారు. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నారు. ఆమెకు భారతనాట్యంలో ప్రావీణ్యం ఉంది.

దుల్కర్సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నవంబరు 20న విడుదల కానుంది. పవన్ సాధినేని దర్శకుడు. శ్రుతీహాసన్, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించారు.

సాత్విక తండ్రి మాధవన్. ఆయనకు తెలుగు వచ్చు. మాధవన్ తప్ప, సాత్విక ఇంట్లోని వారు అందరు తమిళంలోనే మాట్లాడతారు. సో..సాత్వికకు తమిళం వచ్చు.











