సౌత్‌ డైరెక్టర్‌తో హృతిక్‌రోషన్‌

Viswa
HrithickRoshan Hombalefilms

Web Stories

బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హృతిక్‌రోషన్‌ చూపు సౌత్‌కు మళ్లింది. దక్షిణాదిలో ‘సలార్, కేజీఎఫ్, కాంతార’ వంటి సినిమాలను నిర్మించిన కన్నడ ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్‌ లేటెస్ట్‌గా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి సిద్ధమైంది. హోంబలే ఫిల్మ్స్‌  (Hombale Films) సంస్థ బాలీవుడ్‌ అగ్ర కథా నాయకుడు హృతిక్‌రోషన్‌తో (Hrithik Roshan next Movie)  సినిమా చేయనున్నట్లుగా ప్రకటించింది. ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని హృతిక్‌రోషన్‌ కూడా కన్ఫార్మ్‌ చేశారు .

HombaleFilms With Hrithik Roshan #HRITHIKROSHANWithHombalefilms
HWithH

దర్శకుడు ఎవరు?

హృతిక్‌రోషన్‌తో హోంబలే ఫిల్మ్స్‌ చేయబోయే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? అన్న విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కాగా ఈ సినిమాకు ఓ సౌత్‌ డైరెక్టర్‌ దర్శకత్వం వహించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఎందుకంటే..హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఇప్పటి వరకు ఎక్కువగా హిందీ దర్శకులతో సినిమాలు చేసింది లేదు. దీంతో హృతిక్‌రోషన్‌తో ఈ సంస్థ చేయబోయే సినిమా కచ్చితంగా సౌత్‌ దర్శకుడితో ఉంటుందనే టాక్‌ ప్రచారంలోకి వచ్చింది. హోంబలే ఫిల్మ్స్‌లో (HombaleFilms Next movies) సినిమాలు చేయబోతు న్నారంటూ..గతంలో ప్రశాంత్‌నీల్, లోకేష్‌ కనగరాజ్, సుధాకొంగర వంటి వార్ల పేర్లు వినిపించాయి. మరి..ఈ ముగ్గరిలో హృతిక్‌రోషన్‌తో ఎవరు సినిమా చేస్తారు? లేక మరో దర్శకుడి పేరు ఏమైనా తెరపైకి వస్తుందా? అనేది చూడాలి.

క్రిష్‌4 సంగతి ఏంటి!

హృతిక్‌రోషన్‌ లేటెస్ట్‌ మూవీ ‘వార్‌ 2’ (War 2)  ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది. ఈ మూవీ తర్వాత హృతిక్‌రోషన్‌ ఇమ్మిడియట్‌ ప్రాజెక్ట్‌ ‘క్రిష్‌ 4’  (Krish4)అనే అని అందరు అనుకున్నారు. పైగా ‘క్రిష్‌ 4’ సినిమాకు హృతిక్‌రోషనే దర్శకుడు. ఈ తరుణంలో హృతిక్‌తో హోంబలే ఫిల్మ్స్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ రావడంతో, మరి..‘క్రిష్‌ 4’ సినిమా స్టేటస్‌ ఏంటని ఆలో చిస్తున్నా రు..హృతిక్‌ రోషన్‌ ఫ్యాన్స్‌.

సౌత్‌వైపు చూస్తున్న టాప్‌ బాలీవుడ్‌ హీరోలు

ఒకప్పటి బాలీవుడ్‌ వైభవం అయితే ఇప్పుడు లేదు. హిందీ అగ్రకథానాయకులు సౌత్‌లో వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రభాస్‌ హీరోగా చేసిన ‘కల్కి2898ఏడీ’లో అమితాబ్‌బచ్చన్‌ ఓ లీడ్‌ రోల్‌ చేశాడు, రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అజయ్‌దేవగన్, ప్రభాస్‌ రాజాసాబ్‌లో సంజయ్‌ దత్, ఫౌజిలో మిధున్‌చక్రవర్తి, దేవరలో బాబీ డియోల్‌…ఇలా వీలైనప్పుడల్లా…తెలుగు సినిమాల్లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోలూ సినిమాలు చేస్తున్నారు. ఇలా మరికొంతమంది హిందీ హీరోలు కూడా దక్షిణాది వాళ్లతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆమిర్‌కాన్‌–లోకేష్‌ కనగరాజ్‌ మూవీ ఆల్మోస్ట్‌ కన్ఫార్మ్‌ అనే వార్తలు ఉన్నాయి. సల్మాన్‌ఖాన్‌తో ఓ సినిమా చేసేం దుకు తెలుగు దర్శకులు టచ్‌లోనే ఉన్నారు.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi