Ramcharan – sukumar: ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బాస్టర్ మూవీ తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌తో మరో మూవీ రానుంది. రెండు సంవత్సాల క్రితం అంటే…2024 మార్చి 25న ఈ సినిమాను ప్రకటించారు. కానీ ఇంత వరకు సెట్స్‌కు వెళ్లలేదు (Ramcharan – sukumar). రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నా యి. దుబాయ్‌లో చాలా రోజులు స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
అయితే సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన గత బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’ సినిమా బ్లాక్‌బస్టర్. తన సినిమా కూడ ‘పుష్ప’ మాదిరి బ్లాక్‌బస్టర్ అయ్యేలా ఓ స్ట్రాంగ్ స్క్రిప్ట్‌ను రెడీ చేయమని సుకు మార్‌ను ప్రజెర్ చేస్తున్నారట రామ్‌చరణ్. చరణ్ రిక్వెస్ మేరకు సుకుమార్ కూడా ఓ స్ట్రాంగ్ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో పడ్డారట. కథ పెద్దది కావడంతో, ఈ సినిమాను రెండు భాగాలగా తీయాలని భావిస్తున్నారట సుకుమార్. ఈ కారణంగానే ఈ సినిమా షూటింగ్ కాస్త ఆల్య మౌతోందనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఇందులో రామ్‌చరణ్ హీరో. అయితే ఈ ‘పెద్ది’ సినిమాపై కూడా సూపర్‌విజన్ చేస్తున్నారట సుకుమార్. మరి..‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.