Arjun son of Vyjayanthi Movie Teaser: తల్లీకొడుకుల వార్‌

Arjun son of Vyjayanthi Movie: కళ్యాణ్‌రామ్‌ హీరోగా, విజయశాంతి లీడ్‌ రోల్‌లో యాక్ట్‌ చేసిన 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' మూవీ టీజర్‌ విడుదల

Viswa
2 Min Read
KalyanRam Arjun son of Vyjayanthi Movie

Web Stories

కళ్యాణ్‌రామ్‌ (KalyanRam) లేటెస్ట్‌ మూవీ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ మూవీ టీజర్‌ (Arjun son of Vyjayanthi Movie Teaser) ఆకట్టుకుంటోంది. విజయశాంతి ఈ సినిమా కోసం మరోసారి పోలీసాఫీసర్‌ పాత్రలో యాక్ట్‌ చేశారు. అర్జున్‌ విశ్వనాథ్‌గా కళ్యాణ్‌రామ్, వైజ యంతిగా విజయశాంతి ఈ మూవీలో యాక్ట్‌ చేశారు. తల్లీకొడుకుల ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీ ఉండ బోతున్నట్లుగా టీజర్‌ స్పష్టం చేస్తోది.

ఏప్రిల్‌లో రిలీజ్‌


కళ్యాణ్‌రామ్, విజయశాంతిలతో పాటుగా, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, సోహైల్‌ఖాన్, పృథ్వీరాజ్‌లు ఈ మూవీలోని ఇతర లీడ్‌ యాక్టర్స్‌గా చేస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బులుసు ఈ సినిమాను నిర్మించారు. ప్రదీప్‌ చిలుకూరి ఈ మూవీ డైరెక్టర్‌. ‘కాంతార’ ఫేమ్‌ అజనీష్‌ లోకనాథ్‌ ఈ మూవీకి సంగీత దర్శకుడు. ఈ మూవీవి ఏప్రిల్‌లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్రయ త్నాలు చేస్తున్నారని తెలిసింది. ఏప్రిల్‌ రెండో వారంలో ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కథ ఏంటి?


వైజయంతి (విజయశాంతి) పోలీసాఫీసర్‌. తన కొడుకు అర్జున్‌ విశ్వనాథ్‌ను కూడా పోలీస్‌ ఆఫీసర్‌గా చేయాలనుకుంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల అర్జున్‌ విశ్వనాథ్‌ ఓ రౌడీషీటర్‌లా మారతాడు. దీంతోఓ పోలీస్‌ ఆఫీసర్‌లా తన సొంత కొడుకునే కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత వైజయంతిపై ఉంటుంది. ఒక వైపు ఎమోషన్, మరోవైపు డ్యూటీ…ఈ రెండు అంశాలను వైజయంతీ ఎలా బ్యాలెన్స్‌ చేసి, విద్రోహశక్తుల నుంచి తన కొడుకును కాపాడుకుంది? అన్నదే ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ కథగా తెలుస్తోంది. కథలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు సోహైల్‌ఖాన్, హీరోయిన్‌గా సాయి మంజ్రేకర్, మరో పోలీసాఫీసర్‌గా పృథ్వీరాజ్‌ కనిపిస్తారు. ఇక సోహైల్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

 

ఎమోషనల్‌ సెంటిమెంట్‌


గతంలో తండ్రీకొడుకుల ఎమోషన్‌తో వచ్చిన ‘పటాస్‌’ సినిమా కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు తల్లీకొడుకుల ఎమోషనల్‌ డ్రామాతో రాబోతున్న అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి మూవీస్‌అంచనాలు ఏర్పడ్డాయి. మరి..ఫైనల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్‌ రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Please Share
3 Comments
ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi