please subscribe to Tollywoodhub YouTube channel

Chiranjeevi Next films: మెగాస్టార్‌…మెగాస్పీడ్‌…మెగా లైనప్‌..ఒకేసారి నాలుగు సినిమాలు

Viswa
1 Min Read

Web Stories

Chiranjeevi Next films: మెగాస్టార్‌ చిరంజీవి ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశారు. ఒకటి కాదు..రెండు…ఏకంగా నాలుగు సినిమాలకు సైన్‌ చేశారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నాడు.‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో రూపొ ందుతున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు మోహన్‌రాజాతో వర్క్‌ చేస్తారు చిరంజీవి. ఈ సినిమాకు చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితా కొణిదెల ఓ నిర్మాతగా ఉంటారు. ‘విశ్వం భర’ సినిమా విడుదలైన తర్వాత ఈ మూవీ ప్రారంభం అవుతుంది.

ఈ సినిమాలే కాకుండ ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, సుధాకర్‌ చెరుకూరి నిర్మాతలుగా చిరంజీవి హీరోగా ఓ సినిమా చేస్తారు. నానితో శ్రీకాంత్‌ ఓదెల ప్రస్తుతం ‘ప్యారడైజ్‌’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవితో శ్రీకాంత్‌ సినిమా మొదలవుతుంది. ‘ప్యారడైజ్‌’ సినిమా పూర్తి కావడానికి సమయం పడుతుంది. సో…చిరంజీవి, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లోని మూవీ 2025 చివర్లో సెట్స్‌పైకి వెళ్తుంది.

20241204 0104223166582694074084285

దర్శకుడు అనిల్‌రావిపూడితో కూడా సినిమా కమిటైయ్యారు చిరంజీవి. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తారు. 2025లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది.

20241204 0000223065215976297439514

ఈ చిత్రాల తర్వాత ‘అర్జున్‌రెడ్డి, యానిమల్‌’ సినిమాలు తీసిన సందీప్‌రెడ్డి వంగాతో కూడా చిరంజీవి సినిమా ఉంటుంది. ఈ మూవీ కాస్త ఆలస్యంగా …అంటే 2027లో సెట్స్‌పైకి వెళ్తుందని ఊహింవచ్చు.

 

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi