please subscribe to Tollywoodhub YouTube channel

షూటింగ్‌ స్టార్ట్‌ కాకముందే రూ. 100 కోట్లు!

Viswa
1 Min Read
Nani the Paradise movie

Web Stories

హీరోగా, నిర్మాతగా నాని (Hero nani) వరుస విజయాలు ఫిల్మ్‌ ఇండస్ట్రీ వాసుల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ తరుణంలో మరోసారి నాని లేటెస్ట్‌ మూవీ ‘ది ప్యారడైజ్‌’ (The Paradise movie Business) చర్చనీయాంశమైంది. ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో ‘ది ప్యారడైజ్‌’ (Paradise movie) మూవీని ప్రకటించారు. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. కేవలం ఈ సినిమా గ్లింప్స్‌కే కోటి రూపాయాలు ఖర్చుపెట్టారు మేకర్స్‌. ఈ గ్లింప్స్‌ వీడియో బాగా వర్కౌట్‌ అయ్యింది. బిజినెస్‌ సర్కిల్స్‌లో ‘ది ప్యారడైజ్‌’ సినిమాకు క్రేజ్‌ బాగా పెరిగింది. నాని వరుస సినిమాలను సొంతం చేసుకుంటున్న నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ మరోసారి నాని జడ్జ్‌మెంట్‌పై నమ్మకం ఉంచి, ‘ది ప్యారడైజ్‌’ సినిమాను దాదాపు. రూ. 65 కోట్లకు డీల్‌ కుదుర్చుకుందని సమాచారం. అలాగే ఈ సినిమా ఓవర్‌సీస్‌ హక్కులకు కూడా మంచి బేరం కుదిరిందని తెలిసింది. ఇంకా ‘ది ప్యారడైజ్‌’ సినిమా ఆడియోసాంగ్స్‌కు రూ. 18 కోట్ల రూపాయల డీల్‌ కుదిరిందని తెలుస్తోంది. సరిగమ సంస్థ ‘ది ప్యారడైజ్‌’ సినిమా ఆడియో రైట్స్‌ను దక్కించుకుంది. ఈ పీరియాడికల్‌ అండ్‌ సికింద్రబాద్‌ నేపథ్యం ఉన్న ఈ ప్యారడైజ్‌ సినిమాకు అనిరు«ద్‌రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇలా..ఇంకా నాని షూటింగ్‌లో స్టార్ట్‌ కాకముందే ‘ది ప్యారడైజ్‌’ సినిమాకు రూ. 100 కోట్ల బిజినెస్‌ చేకూరి నట్లయింది. షూటింగ్‌ స్టార్ట్‌ కాకముందే…60 శాతం రికవరీ వచ్చి పడింది ఈ చిత్రం నిర్మాత సుధాకర్‌ చెరుకూరికి. ది ప్యాది ప్యారడైజ్‌ మూవీ 2025 మార్చి 26న (The Paradise movie Release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi