Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా నిర్మించే అవకాశం వస్తే చాలని అగ్ర నిర్మాణ సంస్థలు ఏళ్ల తరబడి వేచి చూస్తుంటాయి. ప్రస్తుతం పవన్ లైనప్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం మరో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ దగ్గర పవన్ డేట్స్ ఉన్నాయని, వీరిద్దరి కాంబోలో త్వరలోనే ఒక క్రేజీ అప్‌డేట్ రాబోతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిర్చి’తో ప్రయాణం మొదలుపెట్టిన యువి క్రియేషన్స్, అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదిగింది.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ను నిర్మిస్తోంది కూడా ఈ సంస్థే. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు వీరు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రస్తుత లైనప్‌లో సురేందర్ రెడ్డి సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ ఖాళీగా ఉంది. ‘ఓజీ పార్ట్ 2’ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం తక్కువగా ఉండటంతో, యువి క్రియేషన్స్ ఈ గ్యాప్‌లో పవన్‌తో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తోందట. ఈ ప్రచారం గనుక వాస్తవమైతే యువి క్రియేషన్స్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లే.
అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలతో వరుసగా భారీ చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థగా యువి క్రియేషన్స్ పేరు నిలిచిపోతుంది. పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మించబోయే సురేందర్ రెడ్డి మూవీ తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్ ఉండవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కమిట్‌మెంట్స్ మధ్యలోనే సినిమాలను పూర్తి చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మరి యువి క్రియేషన్స్‌తో పవన్ చేయబోయే ఆ క్రేజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరో తెలియాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే!
Casinoabc999, the number 999 makes me think of big payouts. Hope this place is legit, going to give it a whirl soon. casinoabc999
68mx, a lot of new sites coming out these days. Gonna take a peek and see if its worth adding to the rotation! Good luck everyone. 68mx
191betapp – another app! Hoping this one has a good user interface and doesn’t crash on me when I’m winning! Trying it out! 191betapp