పవన్ కొత్త సినిమాకి అంతా రెడీ.. షూటింగ్ అప్పటి నుంచే?

Kumar NA

Web Stories

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త అందించారు. రాజకీయ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, తన పాత సినిమా కమిట్‌మెంట్స్‌ను ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ చేయబోయే క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

చాలా కాలంగా వార్తల్లో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు వేడుకను ఉగాది పర్వదినం నాడు నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఆ రోజే పూజా కార్యక్రమాలతో పాటు తొలి షాట్‌ను కూడా చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ‘రేసుగుర్రం’, ‘ధృవ’ వంటి స్టైలిష్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సురేందర్ రెడ్డి, పవన్ కోసం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌ను సురేందర్ రెడ్డి తనదైన స్టైలిష్ టేకింగ్‌తో సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారట. ముహూర్తం పూర్తి కాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.

పవన్ తన పొలిటికల్ షెడ్యూల్‌కు ఇబ్బంది కలగకుండా ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే పండుగ మూడ్‌లో ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా హంగామా తగ్గేలోపే సురేందర్ రెడ్డి సినిమా ప్రారంభం కానుండటం మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi