HHVM Final Release: హరిహరవీరమల్లు ఫైనల్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Viswa
2 Min Read
pawankalyan hariharaveeramallu final release date fixed. movie going release on june12, 2025 #Pawankalyan #Hariharaveeramallu #HHVMRelease

పవన్‌కళ్యాణ్‌ ‘హరిహరవీరమల్లు’ సినిమా ఫైనల్‌ రిలీజ్‌ డేట్‌  (HHVM Final Release) ఖరారైంది. హరిహరవీరమల్లు సినిమా విడుదల (Hariharaveeramallu Release) తేదీ మార్చి 28న జరగాల్సింది. కానీ మే 9కి వాయిదా వేశారు. మళ్లీ జూన్‌ 13న హరిహరవీరమల్లు సినిమా విడుదల అయ్యే చాన్సెస్‌ ఉన్నాయనే టాక్‌ వినిపించింది. తాజాగా ‘హరిహరవీరమల్లు’ సినిమాను జూన్‌ 13 కాకుండా…ఒకరోజు ముందుగానే…జూన్‌ 12న (pawankalyan Hariharaveeramallu Release date) రిలీజ్‌ చేస్తున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

pawanKalyan HariharaVeeramallu movie releaseing on may9
pawanKalyan HariharaVeeramallu movie releaseing on may9

‘హరిహరవీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలిభాగం ‘హరిహరవీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’సినిమా జూన్‌ 12న విడుదల అవుతుంది. జ్యోతికృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా జోక్యం చేసు కున్నారని తెలిసింది. ఏఏమ్‌ రత్నం, అద్దంకి దయాకర్‌రావు నిర్మించిన ‘హరిహరవీరమల్లు’ మూవీలో నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా చేశారు. నాజర్, బాబీ డియోల్‌లు ఇతర కీలక పాత్రల్లో యాక్ట్‌ చేశారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

రెండోపార్టు ఉంటుందా?

నాలుగు సంవత్సరాలు ‘హరిహరవీరమల్లు’ మూవీ సినిమాను తీస్తున్నారు. ఇక ఈ సిని మాలోని కొన్ని మేజర్‌ సీన్స్‌పై ఇప్పటికే కొన్ని లీక్స్‌ బయటకు వచ్చాయి. ఓ జంతువుతో ఫైట్, పడవలో పవన్‌కళ్యాణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్, సెకండాఫ్‌లో అండర్‌ వాటర్‌ సీన్‌..వంటి సెకండాఫ్‌లో వచ్చే ఓ మేజర్‌ యాక్షన్‌ సీక్వెన్స్, చార్మినార్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లు బాగా వచ్చాయట. నిధిఅగర్వాల్‌ ప్లే చేసే పంచమి క్యారెక్టర్‌ చుట్టూ ఉన్న సస్పెన్స్‌ సినిమాలో మరో మేజర్‌ హైలైట్‌ ఉండబోతుందని తెలిసింది. ఇక ‘హరిహరవీరమల్లు’ సినిమా రెండో పార్టు ఉంటుందా? లేదా? అనేది తొలిపార్టు ‘హరిహరవీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ విజయంపై ఆధారపడి ఉంటుంది.

పవన్‌కళ్యాన్‌ ప్రస్తుతం సుజిత్‌ డైరెక్షన్‌లోని ‘ఓజీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరులో విడుదల కానుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సిని మా షూటింగ్‌ పూర్తయిన తర్వాత, ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా సెట్స్‌లో జాయిన్‌ అవుతాడు పవన్‌. తమిళ హిట్‌ ‘తేరీ’ సినిమా తెలుగు రీమేక్‌గా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రూపొందుతుందనే టాక్‌ వినిపిస్తోంది. హరీష్‌శంకర్‌ డైరెక్షన్‌లో మైత్రీమూవీమేకర్స్‌ నవీన్, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

 

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *