PawanKalyan Next film: పవన్‌కల్యాణ్ హీరోగా నటించనున్న కొత్త సినిమా ఖరారైంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఈ సినిమాకు రామ్ తాళ్ళూరి నిర్మాత. వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ఈ సినిమాను ఆల్రెడీ ఎప్పుడో ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్ల లేదు. ఒక దశలో ఈ సినిమా సెట్స్‌కు వెళ్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమైయ్యాయి.
పైగా అఖిల్‌తో దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘ఏజెంట్’ వంటి ఓ డిజాస్టర్ మూవీని తీశాడు. దీంతో పవన్‌తో సురేందర్‌రెడ్డి సినిమా ఉంటుందా? అనే డౌట్స్ కూడా మొదలైయ్యాయి. కానీ సురేందర్‌రెడ్డితో సినిమా చేసేందుకు పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అసలు..సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లోని బ్లాక్‌బస్టర్ మూవీ ‘కిక్’లో పవన్ కల్యాణ్ హీరోగా నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సాధ్యపడలేదు. ఫైనల్‌గా ఇప్పుడు ఇలా కుదురుతుంది.
‘ఓజీ’ సినిమా తర్వాత దర్శకుడు అనిల్‌రావిపూడితో పవన్‌కల్యాణ్ ఓ సినిమా చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. సముద్రఖని, త్రివిక్రమ్ వంటి వార్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఫైనల్‌గా…సురేందర్‌రెడ్డికి చాన్స్ ఇచ్చారు పవన్.
నిర్మాత ఏఏమ్ రత్నంతో తనకు ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ ‘హరిహరవీరమల్లు’, డీవీవీ దానయ్యతో ‘ఓజీ’ సిని మాలను కంప్లీట్ చేశాడు. ఇప్పుడు సురేందర్‌రెడ్డి–రామ్ తాళ్ళూరుతో చేయాల్సిన పెండింగ్ ప్రాజెక్ట్‌ను టేకాఫ్ చేస్తున్నాడు. ఇదే స్పీడ్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చేయాల్సిన సినిమానూ కూడ పవన్ సెట్స్‌కు తీసుకువెళ్తాడెమో చూడాలి.
ఇక పవన్‌కల్యాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ వచ్చే వేసవిలో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. హరీష్‌శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. మైత్రీమూవీమేకర్స్ నిర్మించారు. రాశీఖన్నా, శ్రీలీల హీరో యిన్స్‌గా చేశారు.
Right here is the right website for anyone who wants to find out about this topic. You understand a whole lot its almost tough to argue with you (not that I personally will need to…HaHa). You definitely put a fresh spin on a topic that’s been written about for a long time. Wonderful stuff, just excellent!
топ-5 онлайн казино с лицензией
https://1wins34-tos.top
https://t.me/s/minimalnii_deposit/134
Nice88Bet, I’ve found it pretty reliable. They have a good range of sports and other things to bet on plus fast payouts are always a plus!nice88bet
https://t.me/s/KAZINO_S_MINIMALNYM_DEPOZITOM
https://t.me/s/russIa_caSIno_1Win