వచ్చే సంక్రాంతికి ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమా?

Viswa

Web Stories

Prabhas Spirit Release: ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్‌’. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. రీసెంట్‌గా ప్రభాస్‌ వేకేషన్‌కి వెళ్లారు. తిరిగొచ్చిన తర్వాత ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ (Prabhas new movie Spirit) సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. అయితే ఈ సినిమాను తొలుత ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్‌ చేద్దామనుకున్నారు. ఎందుకంటే..సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లోని గత చిత్రం రణ్‌బీర్‌కపూర్‌ ‘యానిమల్‌’ చిత్రం డిసెంబరు సీజన్‌లోనే విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ‘స్పిరిట్‌’ సినిమానూ కూడ డిసెంబరు సీజన్‌లోనే రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్‌గా వచ్చే సంక్రాంతికి (Spirit movie Prabhas release date) రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలిసింది (Prabhas Spirit update).

.

సంక్రాంతి రిలీజ్‌ సాధ్యమైనా?

ఈ ఏడాది సంక్రాంతికి ప్రభాస్‌ నుంచి ‘ది రాజాసాబ్‌’ సినిమా విడుదలైంది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లభించలేదు. దీం తో వచ్చే సంక్రాంతికి సరైన హిట్‌ కొట్టాలని ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. అయితే ప్రభాస్‌ ప్రస్తుతం ‘ఫౌజి’ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాదే ‘కల్కి 2’ సినిమానూ షూటింగ్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. ‘ఫౌజి’, ‘కల్కి 2’ చిత్రాల వరుస షూటింగ్‌లు, ‘స్పిరిట్‌’ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ అయ్యేలా చేస్తాయో లేదో చూడాలి.

భార్యభర్తలుగా ప్రభాస్, త్రిప్తిదిమ్రీ

ఇక ఈ స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. త్రిప్తిదిమ్రీ హీరోయిన్‌. త్రిప్తిదిమ్రి డాక్టర్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్, త్రిప్తి దిమ్రీ భార్యభర్తలుగా నటిస్తున్నట్లుగా తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్, కాంచన, వివేక్‌ ఓబెరాయ్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషణ్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌లు ‘స్పిరిట్‌’ సినిమాను నిర్మిస్తున్నారు. ‘యానిమల్‌’ సినిమాకు సంగీతం అందించిన హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ‘స్పిరిట్‌’ చిత్రానికీ సంగీతం అందిస్తున్నాడు.
వచ్చే సంక్రాంతికి భారీ సినిమాలు

ఇక వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాల పోటీ ఉన్నట్లే కనిపిస్తుంది. ఆల్రెడీ రజనీకాంత్‌ సినిమా వచ్చే పొంగల్‌కి రిలీజ్‌ అవుతుంది. చిరంజీవి–బాబీల కాంబినేషన్‌లోని గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కూడా సంక్రాంతి సందర్భంగానే రిలీజ్‌కు సిద్ధమౌతుంది. తేజ సజ్జా ‘జాంబీరెడ్డి 2’ కూడా 2027 సంక్రాంతికే (Sankranthi 2027 movies) రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో 2027లో అన్నీ భారీ చిత్రాలే సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కానున్నట్లుగా తెలుస్తోంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi