Akkineni Akhil Next FIlm: ఇక అఖిల్‌ వంతు!

Akkineni Akhil Next FIlm: అక్కినేని అఖిల్‌ నెక్ట్స్‌ మూవీ రిజల్ట్‌ ఎలా ఉంటుందోన్న ఆసక్తి నెలకొని ఉంది.

Viswa
1 Min Read
Hero Akkineni Akhil News

Web Stories

అక్కినేని వారసలు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil Next FIlm) లకు యాక్టింగ్‌ పరంగా గత ఏడాది కాస్త గడ్డుగా గడిచింది. వీరు నటించిన సినిమా ఏదీ కూడా 2024లో విడుదల కాలేదు. 2023లో విడుదలైన నాగచైతన్య ‘కస్టడీ’, అఖిల్‌ ‘ఏజెంట్‌’ మూవీ కూడా డిజాస్టర్స్‌గా నిలిచాయి.

కానీ ‘తండేల్‌’ మూవీతో నాగచైతన్య సూపర్‌హిట్‌ కొట్టాడు. నాగచైతన్య, సాయిపల్లవిలు హీరో హీరో యిన్లుగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన, ‘తండేల్‌’ మూవీ ఫిబ్రవరి 7న విడుదలై, సూపర్‌హిట్‌ కొట్టింది. ఈ సినిమా వందకోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. ఇలా నాగచైతన్య ‘తండేల్‌’ హిట్‌తో కాస్త రిలాక్స్‌ అయ్యాడు.

కానీ అఖిల్‌పై ఉన్న ప్రెజర్‌ మాత్రం కొనసాగుతూనే ఉంది. ‘ఏజెంట్‌’ వంటి ఫ్లాప్‌ మూవీ తర్వాత అఖిల్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ౖపై ఇంకా ఏ అధికారిక ప్రకటన రాలేదు. కానీ కిరణ్‌అబ్బవరంతో ‘వినరో భాగ్యమువిష్ణుకథ’ తీసిన దర్శకుడు కిరణ్‌తో, అఖిల్‌ ఓ మూవీ చేస్తున్నాడనే టాక్‌ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైపోయిందట. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా చేస్తున్నారని తెలిసింది. రీసెంట్‌ టైమ్స్‌లో కుర్ర హీరోలకు ఎక్కువ హిట్స్‌ ఇస్తున్న సితార ఎంటర్‌టైన్మెంట్స్, అఖిల్‌ సొంత నిర్మాణసంస్థవంటి అన్నపూర్ణస్టూడియోస్‌ ఈ మూవీని నిర్మిస్తున్నా యని తెరపైకి వార్తలు వచ్చాయి. మరి..అఖిల్‌ చేసే ఈ ఆరోవ సినిమా కూడా హిట్‌ కొడితే, అక్కినేని అభిమానుల ఆనందం రెట్టింపు అవుతుంది. మరి.. అఖిల్‌ ఏం చేస్తాడో చూడాలి.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi