రజనీకాంత్‌ని మించి పోయిన యశ్‌

Viswa

Web Stories

Yash: ‘కేజీఎఫ్‌’ ఫ్రాంచైజీతో యశ్‌ సూపర్‌స్టార్‌గా నిలిచిపోయాడు. తెలుగులో యశ్‌కు మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఈ మార్కెట్‌ను కంటిన్యూ చేసేలా యశ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ‘కేజీఎఫ్‌’ రేంజ్‌లోనే సినిమాలు చేయాలని,ఆ స్పాన్‌ ఉన్న కథలకే ఒకే చెబుతున్నారు.

అలా యశ్‌ చేస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీ టెయిల్‌ ఆఫ్‌ గ్రోన్‌ అప్స్‌’. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న సినిమాకు గీతూమోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 19న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

రిలీజ్‌ సమయం దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా బిజినెస్‌ వర్క్స్‌ కూడా మొదలై పోయాయి. ‘కేజీఎఫ్‌’ సినిమా తెలుగు హక్కులను దాదాపు రూ. 120 కోట్లతో దక్కించు కున్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు.

ఓ డబ్బింగ్‌ సినిమాకు ఈ రేంజ్‌లో రేటు పలకడం పెద్ద విషయమనే చెప్పాలి. రజనీకాంత్‌ కూలీ సినిమా తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ దాదాపు రూ. 60 కోట్ల రూపాయల వరకు పలికాయి. ఇప్పుడు యశ్‌ సినిమా డబ్బింగ్‌ రైట్స్‌ ఇంతకంటే ఎక్కువ మొత్తంలో అమ్ముడైయ్యాయని స్పష్టంగా తె లుస్తోంది. అంతేకాదు..తెలుగు మార్కెట్‌లో ఓ డబ్బింగ్‌ సినిమాకు ఈ రేంజ్‌ రేటు పలకడం ఇదే ఫస్ట్‌టైమ్‌ అన్న టాక్‌ కూడా ఉంది. ఇలా తెలుగు మార్కెట్‌లో రజనీకాంత్‌ను యశ్‌ మంచిపోయి నట్లుగా తెలుస్తోంది.

టాక్సిస్‌ సినిమాలో రుక్మిణీ వసంత్, నయనతార, హ్యూమాఖురేషీ, కియారా అద్వానీ, తారా సుతారియా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యశ్, కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ అధినేత వెంకట్‌ కె.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డ్రగ్స్‌ మాఫియా, పెద్దలకు సందేశం ఇచ్చే యాక్షన్‌
ఓరియంటెడ్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi