రామ్‌చరణ్‌ పెద్ది సినిమా ఫస్ట్‌ రివ్యూ

Viswa
4 Min Read

Web Stories

Peddi First movie Review: ఈ సంక్రాంతి తర్వాత, థియేటర్స్‌కు చెప్పుకోదగ్గ పెద్ద స్థాయి సినిమా ఏదీ రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే సరైన మిడ్‌రేంజ్‌ సినిమా సక్సెస్‌ కూడా లేదు. ఈ సమ్మర్‌ సీజన్‌లో సైతం ఓ మంచి హిట్‌ మూవీ తెలుగు తెరపై రాలేదు. మరోవైపు యాక్టివ్‌ నిర్మాతలు, తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ పర్సెంటేజీ ఇష్యూ పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదు. ఈ తరుణంలో రామ్‌చరణ్‌ ‘పెద్ది’ సినిమా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. జూన్‌ 4న (Peddi Movie Release date) ఈ సినిమా రిలీజ్‌ కానుండగా, జూన్‌ 3 నుంచే ప్రీమియర్స్‌ ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీఫ్లెక్స్‌ స్క్రీన్స్‌లో రూ.150 టికెట్‌ రేట్స్‌ హైక్‌ ఇచ్చారు. మరి…‘పెద్ది’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే విషయంపై మీరు ఓ లుక్‌ వేయండి…

Peddi cinema storyపెద్ది కథ ఏంటి?

‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను టీమ్‌ వెల్లడించింది. 1970–1980 టైమ్‌ పీరియడ్‌తో విజయనగరం బ్యాక్‌ డ్రాప్‌ తో సాగే సినిమా ‘పెద్ది’. ఈ విలేజ్‌బ్యాక్‌డ్రాప్‌ స్టోరీలో రామ్‌చరణ్‌ టైటిల్‌ రోల్‌ చేశారు (Ramcharan Peddi). హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ఇందులో అచ్చియామ్మ పాత్రలో నటించగా, అప్పలసూరి పాత్రలో జగపతిబాబు నటించారు. గౌర్నా యుడుగా శివరాజ్‌కుమార్, రామ్‌బుజ్జిగా దివ్వేందు శర్మ, రైల్వే ఆఫీసర్‌గా బొమన్‌ ఇరానీ నటించారు (Peddi Movie cast and crew).

(Ramcharan Peddi Story) ప్రభుత్వ గుర్తింపు లేని, ఓ నిమ్నజాతికి చెందిన గిరిజన వ్యక్తి పెద్ది అట. ఓ బెల్లం ఫ్యాక్టరీలో రోజు వారికూలీ. అలాగే ఆటకూలీ కూడా. అంటే..ఏదైనా టీమ్‌కు క్రికెట్, ఫుట్‌బాల్, ఖోఖో వంటి గేమ్స్‌ ఆడి, ఆ టీమ్‌ ఇచ్చే డబ్బులు తీసుకుంటుంటాడు. అయితే పెద్ది నివశించే ఊరికి సరైన ప్రయాణ సౌకర్యాలు ఉండవు. దీంతో ఆ ఊరి ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారట. అలా..ఆ ఊరికి రైల్వేస్టేషన్‌ తీసుకు రావాలని అప్పలసూరి (రామ్‌చరణ్‌ తండ్రి పాత్ర కావొచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి) ప్రయత్నిస్తుంటాడు. ఇందుకు అక్కడి లోకల్‌ ఎమ్‌ఎల్‌ఏ (రావు రమేష్‌ అనే ప్రచారం సాగుతోంది) నో చెప్తుంటాడు. ఈ క్రమంలో అనుకోని సంఘటనల కారణంగా, ఊరి కోసం పెద్ది పెద్ద సవాల్‌ను స్వీక రించాల్సి వస్తుంది? ఆ తర్వాత ఏం జరిగింది. క్రాస్‌ ఓవర్‌ అథ్లెట్‌గా పెద్ది ఊరి కోసం ఏం చేశాడు? అన్నది మిగిలిన సినిమా కథ….అని ప్రచారం సాగుతోంది (Peddi Review).

కథలో హీరో ఇంట్రడక్షన్‌ సీన్స్, రాత్రివేళ జరిగే రెండో క్రికెట్‌ మ్యాచ్, రెజ్లింగ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌…ఈ చిత్రంలో మేజర్‌ హైలైట్స్‌గా ఉంటాయని తెలిసింది. అలాగే పోలీస్‌ స్టేషన్‌లో వచ్చే ఫైట్‌ సీక్వెన్స్‌ కూడా. ఇక మొదట్నుంచి ఈ సినిమా క్లైమాక్స్‌ ఆడియన్స్‌ను కంటతడి పెట్టిస్తుందని మేకర్స్‌ చెబుతూనే ఉన్నారు. సో..‘ఉప్పెన’ సినిమా తరహాలోని క్లైమాక్స్‌ ‘పెద్ది’ సినిమాలోనూ ఉండే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. (Ramcharan Peddi movie First Review)

Ramcharan Peddi Movie New Release date is 07 April 2026

టెక్నికల్‌ సపోర్ట్‌

ఈ ‘పెద్ది’ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం స్పెషల్‌ ఏట్రాక్షన్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన ‘చికిరి చికిరి..’, ‘రైయ్‌ రైయ్‌..’ పాటలు ఆడియన్స్‌ను అలరించాయి. ట్రైలర్‌ కాస్త అండర్‌ ప్లేగా ఉండేలా కట్‌ చేశారని తెలుస్తోంది. అలాగే శ్రుతీహాస్‌–జాన్వీకపూర్‌–రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లోని స్పెషల్‌ సాంగ్‌ ‘హల్లల్లల్లో..’ పాట స్క్రీన్‌పై అదిరిపోయే లెవల్లో ఉంటుందట. రత్నవేలు కెమెరా విజువల్స్, నవీన్‌ నూలి ఎడిటింగ్‌ ఫర్‌ఫెక్ట్‌గా కుదిరాయట. ఇక ఈ సినిమాలోని ఢిల్లీ ఎపిసోడ్‌ కోసం 17 సంవత్సరాల తర్వాత, డిజిటల్‌ కెమెరాను కాకుండ, ఫిల్మ్‌ నెగటివ్‌ను వాడామని రత్నవేలు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

Ramcharan Peddi Song Shoot
Ramcharan Peddi Song Shoot

‘ఉప్పెన’ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను బాగానే హ్యాండిల్‌ చేశారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే క్లైమాక్స్‌ను ఎంత కన్విన్సింగ్స్‌గా ఆడియన్స్‌ చెప్పబోతున్నారు అనేది ‘పెద్ది’ సినిమాకు కీలకంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీమూవీమేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ నిర్మించారు. చాలా సినిమాలకు ఫైనాన్షింగ్‌ చేసిన వెంకట సతీష్‌ కిలారు, తొలిసారిగా నిర్మాతగా మారి ‘పెద్ది’ సినిమాను తీశారు. విజువల్స్‌ చూస్తుంటే..బాగానే ఖర్చు చేశారని తెలుస్తోంది. బడ్జెట్‌ దాదాపు రూ. 350 కోట్ల రూపాయాలు అయ్యిందట. సో..స్క్రీన్‌పై నిర్మాణ విలువలు రిచ్‌గా ఉండే స్కోప్‌ ఉంది.

గమనిక: పెద్ది యూనిట్‌, ప్రమోషన్స్‌లో భాగంగా వెల్లడించిన కొన్ని ఆసక్తికర విషయాలు, ప్రచారంలో ఉన్న కొన్ని ఊహాగానాల మేళవింపుతో ఈ పెద్ది సినిమా ఫస్ట్‌ రివ్యూ రూపుదిద్దబడిందని తెలియజేస్తున్నాం. ఈ ఫస్ట్‌ రివ్యూ పూర్తిగా ఊహాజనితమైన కల్పితగాథగా పరిగణించగలరు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi