Samantha Ruth Prabhu: క్లైమాక్స్‌లో సమంత మూవీ

Samantha Ruth Prabhu: టాప్‌ హీరోయిన్‌ సమంత తెలుగులో పెద్ద సినిమాలేవీ చేయలేదు. హిందీలో ‘రక్త్‌బ్రహ్మాండ’ సిరీస్‌ చేస్తున్నారు. 

Viswa
1 Min Read

రీసెంట్‌ టైమ్స్‌లో టాప్‌ హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu) తెలుగులో పెద్ద సినిమాలేవీ చేయలేదు. హిందీలో మాత్రం ‘రక్త్‌బ్రహ్మాండ’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తున్నారు.  అలాగే తానే ట్రాలాలా అనే ఓ నిర్మాణసంస్థను స్థాపించి, మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించి, చాలా కాలం అయ్యింది. కానీ ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్‌కు వెళ్లిందా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు.

Akkineni Naga Chaitanya: రెండు హారర్‌ మూవీలకు సైన్‌ చేసిన నాగచైతన్య

కానీ సమంత ప్రొడక్షన్‌ హౌస్‌లోని రెండో మూవీ మాత్రం చిత్రీకరణ కంప్లీట్‌ చేసుకునే దిశలో ఉంది. చరణ్‌ పేరి, హర్షిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గవిరెడ్డిలు ప్రధాన తారాగణంగా సమంత ప్రొడక్షన్‌ హౌస్‌లో ఓ మూవీ రానుంది. ‘సినిమాబండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకుడు. హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొం దుతున్న ఈ మూవీలో సమంత ఓ గెస్ట్‌ రోల్‌ చేశారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటు న్నారు.

Heroine Sreeleela: బాలీవుడ్‌లో బిజీ అవ్వాలనుకుంటున్న శ్రీలీల

మరోవైపు ఇటీవల సమంత తండ్రి చనిపోయారు. ఆ బాధతో కొంతకాలం వర్క్‌కు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *