మహేష్ ‘వారణాసి’ లో ప్రభాస్ హీరోయిన్..?

Kumar NA

Web Stories

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అడ్వెంచరస్ వండర్ ‘వారణాసి’. ప్రపంచ సినిమా రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రతిరోజూ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రంలో మరో గ్లోబల్ స్టార్ మెరవబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్.

వారణాసి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకునే ఈ చిత్రంలో నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీపికా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా కనిపించనుందని, ఇది సినిమాకు మరింత అంతర్జాతీయ క్రేజ్ తీసుకొస్తుందని సమాచారం.

అందుకే రజనీకాంత్‌ సినిమా నుంచి తప్పుకున్నాను: లోకేష్‌ కనగరాజ్‌

అయితే ఈ విషయంలో రాజమౌళి టీమ్ ఇప్పటివరకు చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. మరి ఈ రూమర్ ఎలా మొదలైందో తెలియదు కానీ, ఒకవేళ ఇది నిజమైతే ఫ్యాన్స్‌కు అంతకంటే పెద్ద పండుగ మరొకటి ఉండదు. మరోవైపు, దీపికా పదుకునే పేరు ఈ మధ్య ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది. షూటింగ్ సమయాల విషయంలో దీపికా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మధ్య మాటల యుద్ధం జరిగినట్లు వార్తలు వచ్చాయి.

ఆరోగ్య భద్రత దృష్ట్యా షూటింగ్ సమయాలపై దీపికా పెడుతున్న షరతుల వల్ల ఆమెను ‘కల్కి 2’, ‘స్పిరిట్’ వంటి భారీ చిత్రాల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె ‘వారణాసి’ లో చేరుతుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. అంచనాలకు అందని క్యారెక్టరైజేషన్లు వారణాసి సినిమాలో పాత్రల చిత్రణ చాలా విభిన్నంగా ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు హింట్ ఇస్తున్నాయి.

బాలీవుడ్‌ కింగ్‌…ఆ సినిమా రీమేక్‌?

ఒక పోస్టర్‌లో పరమేశ్వరుడి భక్తుడిగా రుద్రాక్షలు, త్రిశూలంతో కనిపిస్తుంటే.. మరోవైపు రాముడిగా కూడా అలరించబోతున్నారట. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా పాత్రలు కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని సమాచారం. వీరితో పాటు మరికొందరు అంతర్జాతీయ నటులు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు. రాజమౌళి తన సినిమాల్లో స్టార్ కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి దీపికా విషయంలో వస్తున్న ఈ వార్తలు కేవలం రూమర్లేనా లేక నిజంగానే ‘వారణాసి’ లో ఆమె మెరవబోతుందా అనేది తెలియాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak