JETLEE Trailer: ప్రముఖ హాస్యనటుడు సత్య హీరోగా గతంలో ‘వివాహాభోజనంబు’ అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఈ సిని మాను సందీప్‌కిషన్ నిర్మించగా, లాక్‌డౌన్ సమయంలో ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు సత్య హీరోగా ‘జెట్లీ’ (JETLEE Trailer) అనే ఫీచర్ ఫిల్మ్ చేశాడు. ఇందులో రియా సింఘ్ హీరోయిన్‌గా నటించగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, శ్రీనివాస్‌రెడ్డి, గుండు సుదర్శన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
‘మత్తువదలరా’ సినిమా దర్శకుడు రితేష్‌రాణా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చెర్రీ (చిరంజీవి), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ సినిమా మే 1న (JETLEE Movie Trailer) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. మైత్రీమూవీమేకర్స్ సంస్థ ఈ సినిమాను సమర్పిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమా ట్రైలర్ కామెడీ హంగామాతో ప్యాక్డ్‌గా ఉంది. ఈ కింది డైలాగ్స్ ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.
హే..ఎవర్నువ్వు..అందానికే అసూయ పుట్టించేలా ఉన్నావ్…
ఎందుకు నాకేం గుర్తుకురావడం లేదు
పోనీ మీకైనా…నేను ఎవరో తెలుసా….
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ని కాదు…ఐ యామ్ డన్ విత్ కామెడీ….
కథను పెద్దగా రివీల్ చేయకుండ, ఉన్న కామెడీ షాట్స్‌తో ‘జెట్లీ’ ట్రైలర్‌ను నింపినట్లుగా తెలుస్తోంది. ‘జెట్లీ’ సినిమాను తొలుత మే1న రిలీజ్‌కు అనుకోలేదు. ఏప్రిల్ 30కి షెడ్యూల్ అయిన రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడటంతో, ‘జెట్లీ’ సినిమాను మే 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ మే1న జెట్లీతో పాటుగా మరికొన్ని సినిమాలూ రిలీజ్ అవుతున్నాయి.