Seetha Payanam Movie: యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా సినిమా ‘సీతా పయనం’ (Seetha Payanam Movie) ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండ, నిర్మించి, నటించారు అర్జున్. ఈ మూవీలో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా నటించగా, అర్జున్ కుమార్తె ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్‌గా నటిం చారు. కోవై సరళ, సత్యరాజ్, ప్రకాష్‌రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అర్జున్, ధ్రువ సర్జా ఈ చిత్రం లోని కీలక పాత్రల్లో నటించారు (Seetha Payanam Movie Cast and crew). ఈ సినిమా ఈ నెల 14న (Seetha Payanam Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మరో విశేషంటే..ఏంటంటే..ఈ సిని మా ఐశ్వర్యా అర్జున్‌కు తెలుగులో తొలి మూవీ (Telugucinema)
‘ఫ్యామిలీ అంటే బరువు కాదు రా..ఆ రిలేషన్‌షిప్‌లో వాళ్ల సపోర్ట్ ఉంటే..ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయవచ్చు’
‘హింటైన ఇవ్వండి…నేను మీ పేరు కనిపెడతాను’
‘భూమిలో పుట్టింది..శ్రీరాములవారికి ప్రియమైనది..’
‘వదిలేయమని చెప్పానుగా..’
‘నాకు తెలిసిందని తనకు చెప్పకమ్మ…’
‘పెళ్లంటే దావత్ కాదు…ఇల్లంటే గదులు కాదు..బందాలు..అనుబంధాలు..’
‘ఏవో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే..లిస్ట్ ఇస్తే..మీరు ఫోన్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తున్నారు..కైండ్లీ నా కారు దిగిపోండి….’
అన్న డైలాగ్స్ ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలో ఐశ్వర్యా అర్జున్ ఓ చెఫ్ రోల్ చేస్తున్నారు. ఈమె తండ్రి పాత్రలో సత్యరాజ్ యాక్ట్ చేశారు. ఓ పని నిమిత్తం ఐశ్వర్యా ఓ చోటుకు వెళ్లి, వస్తుండగా, ఈ ప్రయాణంలో ఆమెకు పరిచయం అయిన ఓ వ్యక్తి వల్ల ఆమె జీవితం ఎలా ప్రభావితం అయ్యిందన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెలుస్తుంది (Seethapayanam Movie Story).