హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్‌నంది కాంబినేషన్లో ఓ మాస్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భోగి (Sharwanand Bhogi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నేటి నుంచి ప్రారంభ మైంది. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లుగా తెలిసింది.
It’s #BHOGI
A BLOOD FEST 🤗https://t.co/HhhjvkXdzuLet’s kill it @IamSampathNandi @anupamahere @DimpleHayathi @KKRadhamohan @KirankumarMann4 @SriSathyaSaiArt pic.twitter.com/tG764M0GfD
— Sharwanand (@ImSharwanand) April 30, 2025
శతమానంభవతి జోడీ!
‘శతమానంభవతి’ సినిమాలో శర్వానంద్, అనుపమాపరమేశ్వరన్లు జంటగా నటించారు. మళ్లీ ‘భోగి’ సినిమాకు జంటగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలోని మరో కీలక పాత్రను హీరోయిన్ డింపుల్ హయాతి చేస్తున్నారు.శర్వానంద్ కెరీర్లో 38వ సినిమా ఇది.
1960 నేపథ్యంలో..!
‘భోగి’ సినిమా 1960 నేపథ్యంతో సాగే, పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామా. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంతో ఈ మూవీ ఉంటుంది. 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలిసింది. దాదాపు 120 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ‘భోగి’ సినిమాను రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు.
This post is extremely radiant. I really like this post. It is outstanding amongst other posts that I’ve read in quite a while. Much obliged for this better than average post. I truly value it!