Sivakarthikeyan25: ముగ్గురు హీరోలు…ఒక హీరోయిన్‌ ఛేంజ్‌?

Viswa
2 Min Read
SivaKarthikeyan _Sudha Kongara

Web Stories

Sivakarthikeyan25: ‘అమరన్‌’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన శివకార్తీకేయన్‌ కొత్త సినిమా (Sivakarthikeyan25) ఖరారైపోయింది. ‘గురు, ఆకాశం నీ హద్దురా’ వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేసిన దర్శకురాలు సుధాకొంగర ఈ సినిమాను తీయనున్నారు.శివకార్తీకేయన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో, ‘జయం’ రవి, అధర్వలు లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు.ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. డ్వాన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శివకార్తీకేయన్‌ కెరీర్‌లోని ఈ 25వ సినిమా ప్రారంభోత్సవం శనివారం చెన్నైలో ప్రారంభమైంది.

Nandamuri Balakrishna Akhanda2: అఖండ 2 రిలీజ్‌ ఫిక్స్‌..కాంతారతో పోటీ

సూర్యతో సినిమా క్యాన్సిల్‌!

ఈ సినిమాను సుధాకొంగర గతంలో సూర్యతో చేయాలనుకున్నారు. అధికారికంగా ప్రకటించారు. సూర్యతో పాటుగా ఈ చిత్రంలో దుల్కర్‌సల్మాన్, బాలీవుడ్‌ నటుడు విజయ్‌వర్మ, మలయాళం నటి నజ్రియాలు నటించాల్సింది. సూర్య నిర్మాణసంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించాల్సింది. కానీ సూర్యకు, సుధా కొంగరకు క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ కథనే ఇప్పుడు శివకార్తీకేయన్‌తో తీస్తున్నారు సుధాకొంగర.

సేమ్‌ స్టోరీ!

ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీత దర్శకుడు. సూర్యతో సుధాకొంగర ఈ సినిమాను ప్రకటించి నప్పుడు, జీవీ ప్రకాష్‌కుమార్‌ ఇది తనకు సంగీత దర్శకుడిగా వందో సినిమా అని ప్రకటించాడు. మళ్ళీ శనివారం వందో సినిమా అంటూ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఇలా సూర్యతో సుధాకొంగర చేయాల్సినసినిమా, శివకార్తీకేయన్‌ హీరోగా వస్తోందని జీవీ ప్రకాష్‌కుమార్‌ పరోక్షంగా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

 

 

 

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi