బోల్డ్ సీన్స్ కి నో చెప్పిందని తమన్నాను అవమానించిన స్టార్ డైరెక్టర్?

Kumar NA

Web Stories

Tamannaah Bhatia: సినిమా ప్రపంచం బయటకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించినా.. తెర వెనుక నటీనటులు పడే కష్టాలు, ఎదుర్కొనే అవమానాలు మరోలా ఉంటాయి. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఒక స్టార్ హీరో తనను అందరి ముందే ఎలా అవమానించారో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది (Tamannaah Bhatia Statement).

కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఒక సంఘటన గురించి తమన్నా మాట్లాడుతూ.. ఓ అగ్ర హీరోతో నటిస్తున్న సమయంలో, ఒక రొమాంటిక్ సీన్ చిత్రీకరించాల్సి వచ్చింది. అయితే ఆ సన్నివేశం నాకు అసౌకర్యంగా అనిపించడంతో, నేను చేయలేనని చెప్పాను. దీనికి ఆ హీరో తీవ్రంగా స్పందిస్తూ, యూనిట్ సభ్యులందరి ముందు నాపై అరిచారు. “ఈ హీరోయిన్‌ను వెంటనే మార్చేయండి” అంటూ రచ్చ చేశారు. ఆ సమయంలో అందరి ముందు తలవంచుకోవాల్సి రావడం ఎంతో బాధ కలిగించిందని తమన్నా పేర్కొన్నారు. మరుసటి రోజు ఆ హీరో తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారని ఆమె వివరించారు. అయితే తమన్నా ఆ హీరో పేరును గానీ, అది ఏ భాషా చిత్రమో గానీ బయటపెట్టలేదు. దీంతో, సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ హీరో ఎవరై ఉంటారా? అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఆమె కెరీర్ ప్రారంభంలో నటించిన స్టార్ హీరోల లిస్టును వెలికితీస్తూ రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ సరసన ‘రోమియో’ అనే చిత్రంలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ మిల్కీ బ్యూటీకి ప్రస్తుతం తెలుగులో ఒక్క ప్రాజెక్ట్ చేయకపోవడం గమనార్హం. మొత్తంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఫిమేల్ యాక్టర్స్ తమ హద్దుల గురించి మాట్లాడితే ఎదురయ్యే సవాళ్లకు తమన్నా ఎదుర్కొన్న ఈ సంఘటనే ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi