Tollywood new Directors 2025: 2025 ఏడాదిలో చాలా మంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మంచి హిట్స్ అందించారు.
‘కోర్టు’ సినిమాతో దర్శకుడి ఈ ఏడాది పరియమైయ్యాడు రామ్ జగదీష్. మార్చిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌ను సాధించడంతో పాటుగా, విమర్శకుల ప్రశం సలూ అందుకుంది. పోక్సో యాక్ట్ నేపథ్యానికి ప్రేమకథను జోడించి, చక్కని సినిమా కథ చెప్పాడు రామ్‌జగదీష్. రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమాలో, ప్రియదర్శి లాయ ర్‌గా మరో ప్రధాన పాత్రలో నటించాడు (Tollywood new Directors 2025).
‘లిటిల్‌హార్ట్స్’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సాయిమార్తాండ్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మౌళి తనూజ్, శివానీ నాగరంలు ఈ చిత్రంలోని హీరో హీరోయిన్స్ రోల్స్ చేశారు. యూత్‌పుల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా నేటి యువతరాన్ని బాగా అలరించింది.
తెలంగాణ నేపథ్యంతో రూపొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో సాయిలు కంబాటి దర్శకుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యాడు. అఖిల్‌రాజ్, తేజస్వినిరావు ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా, ఓ విషాద ప్రేమకథగా ఈ సినిమా కథ తెరకెక్కింది. ఈ కథ ఆడియన్స్‌ను మెప్పించింది
‘దండోరా’ సినిమాతో మురళీకాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కులవివక్ష, కులాంతర వివాహం వంటి అంశాల నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఈ డిసెంబరులో విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది. శివాజీ, నందు, నవదీన్, రవికృష్ణ, మణికా చిక్కాల, రాధ్య, బింధు మాధవి ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఆదిసాయికుమార్ హీరోగా నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు యుగంధర్ ముని. ఈ డిసెంబరులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
కె–ర్యాంప్ సినిమాతో ఆడియన్స్‌ను అలరించి, మంచి హిట్ అందుకున్న దర్శకుడు జైన్స్ నాని. కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజా ఈ చిత్రంలోని హీరో హీరోయిన్స్‌గా నటించారు. అయితే జైన్స్ నానికి ఈ చిత్రం దర్శకుడిగా తొలి మూవీ.
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేసిన ‘ఛాంపియన్’ సినిమాతో దర్శకుడి పరియమై, ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. ఈ చిత్రంతో అనస్వర రాజన్ హీరోయిన్‌గా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైయ్యారు. (Tollywood New Directors 2025)
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో ఆడియన్స్‌ను అలరించారు దర్శకుడు రాహుల్ శ్రీనివాస్. తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్, రెండు ప్రేమకథల మేళవింపు వంటి అంశాలతో ఈ సినిమాను చక్కగా తీశాడు దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ (Telugu Cinema Debuts Directores)
ఇంకా ఈ ఏడాది విడుదలైన ‘రామం రాఘవం’తో ధన్‌రాజ్, సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ చిత్రంతో నీరజా కోన, రవితేజ మాస్ జాతరతో భాను భోగవరపు, ‘దిల్ రుబా’తో విశ్వకరుణ్, ప్రియదర్శి ‘ప్రేమంటే..’తో నవనీత్ శ్రీ రామ్, రాజ్‌తరుణ్ ‘పాంచ్ మినార్’తో రామ్ కడు ముల, అల్లరి నరేశ్ ‘12ఏ రైల్వే కాలనీ’ చిత్రంతో నాని కాసరగడ్డ , పతంగ్ సినిమాతో ప్రణీత్ ప్రత్తిపాటి వంటివారు ఈ ఏడాది దర్శకులుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకులుగా పరిచయమై ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు (New Tollywood Directors Introduced in 2025)
.
QQ88OKVIP sounds like a VIP experience and I need that. Going to test out their support, and then deposit. Check it out for yourself: qq88okvip
Guys, kulisbetaffiliate is a game changer for affiliate marketing I’m really impressed with the program It is user friendly and makes earning money simple kulisbetaffiliate