Trinadha Rao Nakkina| వైరల్‌ కంటెంట్‌ కోసం వల్గర్‌ కామెంట్స్‌ చేయాలా?

Viswa
2 Min Read

Web Stories

డిజిటల్‌ మీడియా హవా పెరిగిపోయిన తర్వాత, సినిమా యూనిట్‌లు తమ మూవీ ప్రమోషన్స్‌ కోసం డిఫరెంట్‌ కంటెంట్‌ను ఆడియన్స్‌లోకి వదులుతున్నారు. మరికొందరు కావాలనే ప్రెస్‌మీట్స్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సినిమా జనాల నోట్లలో నానేలా చేస్తున్నారు. ఇప్పుడు ‘ధమాకా, నేను..లోకల్‌’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు (Trinadha Rao Nakkina) ‘మజాకా’ (Mazaka)సినిమా ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలు చర్చనీయాంశమైయ్యాయి.

Ramcharan GameChanger Movie Review: రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ మూవీ రివ్యూ

తెలుగుకు సరిపోదు..!

రవితేజతో ‘థమాకా’ తీసి బ్లాక్‌బస్టర్‌ కొట్టిన దర్శకుడు నక్కిన త్రినాథరావు తాజాగా ‘మజాకా’ మూవీ చేస్తున్నారు. ఇందులో సందీప్‌కిషన్‌ హీరో, రావు రమేష్‌ మరో లీడ్‌ రోల్‌ చేశారు. అయితే ఈ మూవీలో మన్మధుడు హీరోయిన్‌ అన్షు ఓ లీడ్‌ రోల్‌ చేశారు.

‘‘మన్మధుడు’ సినిమాలో హీరోయిన్‌ అన్షు భలేగా కనిపించారు. మేం కూడా థియేటర్స్‌లో చూశాం. అలాంటి అమ్మాయి మా మజాకా’ మూవీలో హీరోయిన్‌ అంటే…నిజమేనా అనిపించింది. కొంచెం సన్నబడింది. అయితే నేనే…చెప్పాను. కొంచెం తినమ్మా…తెలుగుకు సరిపోదు…అన్నీ కొంచెం ఎక్కు వ సైజుల్లో ఉండాలని చెప్పాను. ఫర్లేదు కొంచెం ఇప్రూవ్‌ అయ్యింది. నెక్ట్స్‌ టైమ్‌ ఇంకా ఇంప్రూవ్‌ అవుద్ది…’’ (నవ్వుతూ…) అంటూ వల్గర్‌ కామెంట్స్‌ చేశారు. ఈ కామెంట్స్‌ పట్ల నెటిజన్లు…తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వాటర్‌ అమ్మా…!

ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘పుష్ప ది రూల్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌లో అల్లు అర్జున్‌…తెలంగాణ సీయం పేరు మర్చిపోయిన…ఇన్సిడెంట్‌ను రీ క్రియేట్‌ చేసి, కాస్త హడావిడి చేశారు నక్కిన త్రినాథరావు. తాను రీతూ వర్మ పేరు మర్చిపోయినట్లుగా కలరింగ్‌ ఇస్తూ.. ఏదో మాట్లాడాడు. ఇండస్ట్రీకి ఓ బ్యాడ్‌ ఇన్సిడెంట్‌గా నిలిచిన ఈ సంఘటనను మళ్లీ గుర్తు చేయడం ఎందుకు? అని సినీ లవర్స్‌ మండిపడుతున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదనే గాసిప్‌లు వినిపిస్తున్నాయి. ఈ ఘటన రాంగ్‌గా వెళితే, ఇండస్ట్రీకే నష్టం.

DaakuMaharaaj Review: డాకుమహారాజ్‌ రివ్యూ

ఇదేం తొలిసారి కాదు!

వేదికపై నక్కిన త్రినాథరావు, వివాదాస్పదంగా ప్రవర్తించడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఓ సినిమా వేదికపై హీరోయిన్‌ను ముద్దు పెట్టు కున్నారు. ఇలా వైరల్‌ కంటెంట్‌ కోసం…దర్శకుడు అనిల్‌రావిపూడి మాదిరి..హాస్యాస్పదమైన స్కిట్స్‌ చేయాలీ కానీ…ఇలాంటి చెత్త పనులు చేయడం ఏ మాత్రం కరెక్ట్‌ కాదని అంటున్నారు నెటిజన్లు. ఇక ‘ధమాకా’ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్స్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

 

 

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos