Vanda Devullu: ‘బిచ్చగాడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘వంద దేవుళ్ళ'(Vanda Devullu) . విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ చిత్రంలో స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామంజనేయులు జవ్వాజి ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను ఈ నెల 19న (Vanda Devullu Release date) రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ”ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్..ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో కూడిన ‘వంద దేవుళ్ళు’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది” అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు బాలాజీ శ్రీరామ్ సంగీతం అందిస్తున్నారు.