వెంకీమామ కోసం ‘పుష్ప’ విలన్ ను దింపుతున్న అనిల్ రావిపూడి..!

Kumar NA

Web Stories

Venkatesh: మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో ఈ ఏడాది అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన తదుపరి ప్రాజెక్టును విక్టరీ వెంకటేష్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయడంతో, ఈ నాలుగో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ కాస్టింగ్ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. మొదట ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ పేరు వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలోకి మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి, ఇటీవల ఫహాద్‌ను కలిసి కథను వివరించారట. కథలోని కొత్తదనం నచ్చడంతో ఫహాద్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో తెలుగు ప్రేక్షకులకు ‘భన్వర్ సింగ్ షెకావత్’గా దగ్గరైన ఫహాద్, ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత అనిల్ రావిపూడి సినిమాతో ఆయన టాలీవుడ్‌లోకి మళ్ళీ అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ కేవలం ఒక పాత్రకే పరిమితం కాకుండా, వెంకటేష్‌కు ప్రతినాయకుడిగా కనిపిస్తారని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే, వెంకీ మార్క్ కామెడీ-యాక్షన్‌కు, ఫహాద్ ఇంటెన్స్ నటన తోడైతే వెండితెరపై మ్యాజిక్ ఖాయమని చెప్పవచ్చు.

వెంకటేష్ – అనిల్ రావిపూడి జోడి అంటేనే వినోదానికి గ్యారెంటీ. ఇప్పుడు ఇందులో ఫహాద్ ఫాజిల్ వంటి ప్రతిభావంతుడైన నటుడు తోడవ్వడం సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ ఒప్పందానికి సంబంధించిన ఫార్మాలిటీస్ జరుగుతున్నాయని, త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos