పవర్ స్టార్ తో మూవీ.. ఎట్టకేలకు నోరు విప్పిన అనిల్ రావిపూడి!

Kumar NA
2 Min Read

Web Stories

Pawankalyan: ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన 10వ సినిమా కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కథను లాక్ చేయడమే కాకుండా, ఒక ఆసక్తికరమైన టైటిల్‌ను కూడా అనుకున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. అయితే, గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై తాజాగా దర్శకుడు స్పష్టతనిచ్చారు (latest telugu cinema news). పవన్ కళ్యాణ్‌తో సినిమాపై అనిల్ రావిపూడి క్లారిటీ (Pawankalyan).

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో (Pawankalyan) అనిల్ సినిమా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. “పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆయన క్రేజ్‌కు తగిన కథ నా వద్ద ఉంది” అని అనిల్ పేర్కొన్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో అత్యంత బిజీగా ఉన్నారని, ఆయన రెగ్యులర్ (telugumovie news) సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు తాను పవన్ కళ్యాణ్‌ను నేరుగా కలిసి ఎటు వంటి కథను వినిపించలేదని, ప్రస్తుతానికి అటువంటి ప్లాన్ కూడా లేదని అనిల్ తేల్చి చెప్పారు (upcomeing telugu movies).

భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే ఈ కాంబినేషన్ సెట్ అవ్వొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన అభినందించారు. ఈ క్రమంలోనే పవన్ – అనిల్ మధ్య ఫోన్ ద్వారా సంభాషణ జరిగి ఉండొచ్చని, ఇది రాబోయే రోజుల్లో వీరిద్దరి కలయికకు పునాది పడేలా చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అనిల్ రావిపూడికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న బలం, పవన్ కళ్యాణ్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల వసూళ్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు (latest telugu movies).

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi