Vanda Devullu Movie: బిచ్చగాడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది తమిళ దర్శకుడు శశి. విజయ్ ఆంటోని హీరో. పదేళ్ల తర్వాత మళ్లీ విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కలిసి సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు ‘వంద దేవుళ్లు’ అనే టైటిల్‌ను పెట్టారు. కానీ ఈ సినిమా మైథలాజికల్ ఫిల్మ్ అయితే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జువ్వాజి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాను తొలుత మే1న రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు కనిపించడం లేదు. కానీ ఈ సినిమాను మాత్రం ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు లు ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడు.