Vijaydevarakonda Accident: యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijaydevarakonda) కు తృటిలో ప్రమాదం తప్పింది. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తన స్నేహితులతో కలిసి, పుట్టపర్తి వెళ్లి వస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని దర్శించు కునేందుకు విజయ్ దేవరకొండ అక్కడికి వెళ్లారు. తిరిగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే, తన మిత్రుడి కారు ఎక్కి, అక్కడ్నుంచి హైదరాబాద్ చేరుకున్నారు విజయ్ దేవరకొండ.
ఇక విజయ్ దేవరకొండ ఆరోగ్యం గురించి, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంతో విజయ్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఇంటికి చేరుకున్నానని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని విజయ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఇక గత శుక్రవారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు నిశ్చితార్థం జరిగిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన నిశ్చితార్థం గురించి విజయ్ అధికారికంగా స్పందించలేదు.
ఇక ‘ట్యాక్సీవాలా’తో తనకు మంచి హిట్ ఇచ్చిన రాహుల్‌తో మరోమూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అలాగే రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో ‘రౌడీ జనార్థన్’ అనే సినిమా కూడా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
Hey, I just stumbled onto your site… are you always this good at catching attention, or did you make it just for me? Write to me on this website — rb.gy/3pma6x?Sic — my username is the same, I’ll be waiting.